కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-05-30T06:33:59+05:30 IST

మార్కాపురం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని కార్మికులు పేర్కొన్నారు.

కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇస్తున్న కార్మికులు

మార్కాపురం (వన్‌టౌన్‌), మే 29 : మార్కాపురం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని కార్మికులు పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్‌ కమిషనర్‌ నయీం అహ్మద్‌కు సమ్మె నోటీసు  ఇచ్చారు. ఈ సందర్భంగా పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు డీకేఎం రఫి మాట్లాడుతూ కరోనా నుంచి రక్షణ పొందేందుకు కార్మికులకు అవసరమైన వస్తువులు అందజేయాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు గరీబ్‌ కల్యాణ్‌ యోజన ఇన్సూరెన్స్‌ పథకం కింద రూ.50లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులకు డీఎంఏ రికమెండ్‌ చేసిన రూ.25వేల పారితోషికాన్ని ప్రతి నెలా చెల్లించాలని,  వేతనాలు వెంటనే పెంచాలని, కార్మికుల జీతాల నుంచి కట్‌ చేసిన పీఎఫ్‌, ఈఎ్‌సఐని వారివారి ఖాతాల్లోకి వెంటనే జమ చేయాలన్నారు.  కార్మికులను సచివాలయాలకు బదలాయించే ముందు వారిని రెగ్యులర్‌ చేయాలన్నారు.  కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.సుబ్బరాయుడు, జి.హరి, ఎస్‌కె హిమాంస, చెల్లి వెంకటసుబ్బయ్య, జి.నారాయణరెడ్డి, ఎస్‌ కె ఇబ్రహీం, డి.హుస్సేన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-30T06:33:59+05:30 IST