కనులపండువగా నగరోత్సవం

ABN , First Publish Date - 2021-10-18T04:45:22+05:30 IST

దసరా నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని శ్రీ వాసవీకన్యకా పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం కనులపండువగా సా గింది.

కనులపండువగా నగరోత్సవం
కలిశాలతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు

మహిషాసురమర్దినిగా 

దర్శనమిచ్చిన వాసవీమాత

నృతప్రదర్శనలు, 

బాణసంచా వెలుగులతో ఊరేగింపు

మార్కాపురం(వన్‌టౌన్‌), అక్టోబరు 17: దసరా నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని శ్రీ వాసవీకన్యకా పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం కనులపండువగా సా గింది. ఆదివారం రాత్రి పులివాహనంపై మహిషాసు రామర్దిని అలంకరణలో  ఆశీనులయ్యారు. ఉదయం అ మ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిం చారు. అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం, చండీ పారా యణం నిర్వహించారు. మహిళలు కోనేటి నుంచి కల శాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు.  రాత్రి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంక రించిన రథంపై వివిధ బంగారు రత్న వజ్ర వైడిర్యాలతో కూడిన ఆభర ణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించారు. నగరోత్స వంలో వివిధ నృత్య ప్రదర్శనలు, రంగరంగుల టపా సులు తీన్మార్‌ తప్పెట్ల నడుమ  ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, కార్యదర్శి సూర్యవెంకట సు బ్బారావు, కోశాధికారి రామడుగు రమేష్‌, పాలకవర్గం సభ్యులు, యువసేన సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.

వైభవంగా వసంతోత్సవం

గిద్దలూరు : దసరా శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా వసంతోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం నుంచి ఆర్య వైశ్య యువకుల ఆధ్వర్యంలో ప్రధాన వీధుల్లో వసంతోత్సవ కార్యక్రమం జరిగింది. ఒకరిపై ఒకరు రంగునీళ్లు చల్లుకుంటూ జై వాసమాంబ అంటూ నినాదాలు చేశారు. అమ్మవారి గ్రామోత్సవం శనివారం రాత్రి ప్రారంభమైఆదివారం ఉదయం 7గంటల వరకు పట్టణంలోని పలు ప్రధాన వీధుల మీదుగా సాగింది. ఆయా కార్యక్రమాలలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు వాడకట్టు రంగసత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు శివపురం ఆంజనేయులు, కమిటీ ప్రతినిధులు గర్రె సత్యనారాయణ, దమ్మాల జనార్దన్‌, ముప్పూరి చంటి పాల్గొన్నారు.  

కంభంలో..

కంభం : దసరా శరన్నవరాత్రి ముగింపు సందర్భంగా  కన్యకాపరమేశ్వరి అమ్మవారు పులివాహనంపై దర్శనమి చ్చారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 7గంటల వరకు పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. పోలీసు బందోబస్తు మధ్య గ్రామోత్సవం సాగింది. కులుకు భజన మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రా వూరి రంగరమేష్‌, బాదం మనోహర్‌ వ్యవహరించారు.  




Updated Date - 2021-10-18T04:45:22+05:30 IST