కట్టు తప్పిన వారిపై కన్నెర్ర

ABN , First Publish Date - 2021-05-13T06:08:03+05:30 IST

కరోనా కట్టడి చర్యలపై అధికారులు దృష్టి సారించారు. బుధవారం ఆంక్షలను మరింత తీవ్ర తరం చేశారు. ఒక వైపు పోలీసులు, మరోవైపు నగర పంచాయతీ అధికారులు పట్టణంలో కలియ తిరిగారు.

కట్టు తప్పిన వారిపై కన్నెర్ర

కొవిడ్‌ ఆంక్షలు తీవ్రతరం

చర్యలకు ఉపక్రమించిన అధికారులు 

పలువురికి జరిమానా విధింపు

పొదిలి, మే 12 : కరోనా కట్టడి చర్యలపై అధికారులు దృష్టి సారించారు. బుధవారం ఆంక్షలను మరింత తీవ్ర తరం చేశారు. ఒక వైపు పోలీసులు, మరోవైపు నగర పంచాయతీ అధికారులు పట్టణంలో కలియ తిరిగారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై చర్యలకు ఉపక్ర మించారు. ఎస్‌ఐ కె.సురేష్‌ తమ సిబ్బందితో కర్ఫ్యూ సమయంలో బయటతిరుగుతున్న 20 మంది వాహన దారులను గుర్తించి జరిమానా విధించారు. మరోసారి బయటకు వస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరిం చారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, మాస్కు లు, భౌతికదూరం తప్పనిసరి అని సూచించారు. మరో పక్క నగర పంచాయతీ అధికారులు మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న 13మంది వాహనదారులకు ఒకొక్కరికీ రూ.100 జరిమానా విధించారు.  12 గంటల తరువాత దుకాణాలు తెరిచిన వారికి, దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించని వారికి జరిమానా విధించారు.  ఎన్జీవో కాలనీ, పడమటిపాలెం, నవాబుమిట్ట తదితర ప్రాంతాలలో పంచాయతీ  పారిశుధ్య సి బ్బంది హైపో క్లోరైడ్‌ ద్రావకాన్ని పిచికారీ చేశారు.  నగర పంచాయతీ కమిషనర్‌ పి. భవానీప్రసాద్‌ మాట్లాడుతూ పట్టణం లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటిం చాలని సూచించారు.  కట్టడి చర్యలకు ప్రజలు సహక రించాలని కోరారు. కర్ఫ్యూ పర్యవేక్షణలో ఏఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మా రుతీరావు, హెడ్‌కాని స్టేబుల్‌ అమీర్‌, కాని స్టేబుల్‌ రమేష్‌ నాయక్‌, గిరి, సిబ్బంది పాల్గొన్నారు. 

ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు 

ఎర్రగొండపాలెం : కరోనా కట్టడి కోసం అమలు చే స్తున్న ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ఇన్‌చార్జి తహసీల్దారు వి.వీరయ్య హెచ్చరిం చారు. ఎర్రగొండపాలెంలో కర్ఫ్యూను బుధవారం ఆయన పర్యవేక్షించారు. అవసరం లేకుండా ద్విచక్ర వాహనాలపై తిరిగే వారిని గుర్తించి పాఠశాల ప్రాంగణానికి చేర్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసరం, వైద్య చికిత్సల నిమిత్తం అయితేనే బయటకు రావాలని సూచించారు.  ఎస్‌ఐ పి.ముక్కంటి మాట్లాడుతూ ఆంక్ష లు అమలులో ఉన్న  సమయంలో అనవసరంగా రోడ్లపై తిరుగుతుంటే  వాహనాలను స్వాధీనం  చేసుకొని కేసు లు నమోదు చేస్తామని తెలిపారు. మాస్క్‌లు ధరించని వారికి రూ.100 చొప్పున జరిమానా విధించారు.  కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ కె.రామసుబ్బారెడ్డి, పోలీసులు, పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు.

త్రిపురాంతకంలో.. 

త్రిపురాంతకం : మండలంలో అమలవుతున్న కర్ఫ్యూను సీఐ దేవప్రభాకర్‌  పర్యవేక్షించారు. స్థానిక టాస్క్‌ఫోర్స్‌ అధికారుల నిర్ణయం మేరకు బుధవారం నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినందున నిబంధనలను కఠినతరం చేశారు. ఈనేపథ్యంలో సీఐ, ఎస్సైలు తమ సిబ్బందితో కర్ఫ్యూను పరిశీలించి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను గుర్తించి స్టేషన్‌కు తరలించారు.


Updated Date - 2021-05-13T06:08:03+05:30 IST