స్వచ్ఛ నగరంగా కనిగిరిని తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2021-10-07T05:34:03+05:30 IST

కనిగిరి నగర పంచాయతీని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 13వ సచివాలయం పరిధిలో గ్రీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఏపీమాస్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య, పరిశుభ్రతపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ నూటికి నూరు శాతం తడిచెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన వ్యర్థాలను వేరు చేయడం గురించి వివరించారు. కనిగిరిని ఆదర్శ నగర పంచాయతీగా తయారు చేసేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు.

స్వచ్ఛ నగరంగా కనిగిరిని తీర్చిదిద్దాలి
తడి చెత్త, పొడి చెత్తపై మహిళలకు అవగాహన కల్పిస్తున్న చైర్మన్‌ గఫార్‌

 - చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌

కనిగిరి, అక్టోబరు 6: కనిగిరి నగర పంచాయతీని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 13వ సచివాలయం పరిధిలో గ్రీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఏపీమాస్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య, పరిశుభ్రతపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ నూటికి నూరు శాతం తడిచెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన వ్యర్థాలను వేరు చేయడం గురించి వివరించారు. కనిగిరిని ఆదర్శ నగర పంచాయతీగా తయారు చేసేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. ఏపిమాస్‌ ఫీల్డ్‌ కో ఆర్టినేటర్‌ భాస్కరరావు మాట్లాడుతూ నీరు వల్ల ఉపయోగాలు, కలుషితం అయితే వచ్చే వ్యాధుల గురించి, పరిసరాల పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత గురించి సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రిజ్వాన, కరిమూన్‌, శానిటరీ సెక్రటరీ లోకేష్‌, సచివాలయ సిబ్బంది, వార్డు వలంటీర్లు, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. 

సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పంచాయతీ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు సూచించారు. పట్టణ సమీపంలోని కాశీపురం గ్రామంలో బుధవారం పర్యటించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. 


Updated Date - 2021-10-07T05:34:03+05:30 IST