వైభవంగా కల్యాణ మహోత్సవం
ABN , First Publish Date - 2021-11-17T05:46:40+05:30 IST
పట్టణంలోని శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో అత్యంత వైభవంగా తులసీదామోదర కల్యాణ మహోత్సవాన్ని నిర్వవహించారు.
గిద్దలూరు, నవంబరు 16 : పట్టణంలోని శ్రీపాతాళ నాగేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో అత్యంత వైభవంగా తులసీదామోదర కల్యాణ మహోత్సవాన్ని నిర్వవహించారు. మహిల భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజలు నిర్వహించారు. తులసీదామోదర కల్యాణ మహాత్మ్యం గురించి పూజారి అనిల్‌స్వామి భక్తులకు వివరించారు. మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పన ఈ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.