కాలువలు నిర్మించరూ..

ABN , First Publish Date - 2021-11-24T05:03:22+05:30 IST

పట్టణంలోని రాచర్ల రోడ్డు వద్ద గల సంజీవరెడ్డినగర్‌ ప్రాంతంలో కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు వర్షం నీరు నిలిచి ఉంటుంది.

కాలువలు నిర్మించరూ..
సంజీవరెడ్డినగర్‌లో మురికికూపంగా మారిన ప్రాంతం

గిద్దలూరు టౌన్‌, నవంబరు 23: పట్టణంలోని రాచర్ల రోడ్డు వద్ద గల సంజీవరెడ్డినగర్‌ ప్రాంతంలో కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు వర్షం నీరు నిలిచి ఉంటుంది.  దీంతో ఆ ప్రాంతం మురికిమయంగా మారి  దోమలు ప్రబలుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు మున్సిపల్‌  కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దోమలు ప్రబలడంతో మలేరియా, డెం గ్యూ జ్వరాలబారిన ప్రజలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.  సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుని ఆప్రాంతంలో మురికి నీటి కాలువలు నిర్మించి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.


Updated Date - 2021-11-24T05:03:22+05:30 IST