అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలకు ప్రాబబుల్స్ ఎంపిక
ABN , First Publish Date - 2021-01-21T04:13:33+05:30 IST
అంతర్ జిల్లాల స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీలకు ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శిఖరం రాంబాబు చెప్పారు.

చినగంజాం, జనవరి 20 : అంతర్ జిల్లాల స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీలకు ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శిఖరం రాంబాబు చెప్పారు. స్థానిక ఎంఎ్‌సఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో జిల్లా పురుషుల జట్టుకు, ఇంకొల్లు బాలికల జడ్పీ పాఠశాలలో జిల్లా మహిళల జట్టుకు బుధవారం ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. చీరాల, కొత్తపేట, వేటపాలెం, రాజుబంగారుపాలెం, మూలగానివారిపాలెం, ఉలవపాడు, పేర్నమిట్ట తదితర ప్రాంతాల నుంచి 59 మంది క్రీడాకారులు హాజరు కాగా వారిలో 16 మందిని జిల్లా పురుషుల జట్టుకు, మహిళా జట్టుకు 21 మందిని ప్రాబబుల్స్‌గా ఎంపిక చేసి, వారికి ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళలకు కోచ్‌గా వంశీకృష్ణ, మేనేజర్‌గా అజయ్‌కుమార్‌లను నియమించినట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ఎంపికైన జట్లు విశాఖ జిల్లా చోడవరం మండలం అంకుపాలెంలో నిర్వహించనున్న 68వ అంతర్ జిల్లాల మహిళ, పురుషుల కబడ్డీ పోటీలలో పాల్గొంటారన్నారు. ఎంపికలో ఎం.గిరిబాబు, ఎన్.ఉమామహేశ్వరరావు, బీ నాగాంజనేయురెడ్డి, పర్వతరెడ్డి పార్థసారిథిలు పాల్గొన్నారు.