ఘనంగా మదర్‌ థెరిస్సా జయంతి

ABN , First Publish Date - 2021-08-27T06:31:09+05:30 IST

మదర్‌ థెరి స్సా జయంతి వేడుకలను గురువారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఆర్డీవో కార్యాల య ప్రాంగణంలో ఉన్న మదర్‌థెరిస్సా విగ్రహానికి విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పూల మాలలు వేసి నివాళులుఆర్పించారు.

ఘనంగా మదర్‌ థెరిస్సా జయంతి
కేకు కట్‌ చేస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పక్కన మేయర్‌ గంగాడ సుజాత

మంత్రి బాలినేని నివాళి


ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 26 : మదర్‌ థెరి స్సా జయంతి వేడుకలను గురువారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఆర్డీవో కార్యాల య ప్రాంగణంలో ఉన్న మదర్‌థెరిస్సా విగ్రహానికి విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పూల మాలలు వేసి నివాళులుఆర్పించారు. విగ్రహ కమి టీ ఆధ్వర్యంలో కేక్‌ను కట్‌ చేశారు. కార్యక్రమంలో మేయర్‌ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వే మూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, వైసీపీ నగర అఽధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, నాయకులు కటారి శంకర్‌,  డీఎస్‌.క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మార్కెట్‌ క మిటీ యార్డు వద్ద మంత్రి బాలినేని కాటాను ప్రా రంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ కఠారి రామచంద్రరావు, ఏడీ ఉపేంద్ర  పాల్గొన్నారు.

 


Updated Date - 2021-08-27T06:31:09+05:30 IST