జర్నలిస్టుల బస్సుపాస్‌లను రెన్యువల్ చేస్తాం
ABN , First Publish Date - 2021-02-26T05:56:13+05:30 IST
జిల్లాలోని జర్నలిస్టుల కు యథావిధిగా బస్సుపాస్‌ల ను రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు.

కలెక్టర్ పోలా భాస్కర్
ఒంగోలు(కలెక్టరేట్), ఫిబ్రవ రి 25 : జిల్లాలోని జర్నలిస్టుల కు యథావిధిగా బస్సుపాస్‌ల ను రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఏపీయూ డబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రచు రించిన డైరీని గురువారం స్థా నిక కలెక్టర్ క్యాంపు కార్యాల యంలో కలెక్టర్ భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు మాధవరెడ్డి, దాసరి కనకయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రిడిడేషన్ గడువు ముగియడం ద్వారా బస్సుపాస్‌లు రెన్యువల్కాలేదన్నారు. జర్నలిస్టుల పిల్లలకు 50శాతం రాయితీతో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు తగ్గింపును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బస్సుపాల్లను రెన్యువల్ చే యడంతో పాటు అన్ని ప్రైవేటు పాఠశాలలకు డీఈవో ద్వారా ఫీజు రాయితీ కోసం స ర్య్కులర్ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు సురేష్, సురేష్‌కుమార్‌రెడ్డి, ఇప్తేకర్బాషా, సుబ్బారావు, రాజు, శంకర్, మాల్యాద్రి, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ను కలిసి యూనియన్ డైరీని అందజేశారు.