పీహెచ్‌సీ సీనియర్‌ అసిస్టెంట్‌కు ఉద్యోగోన్నతి

ABN , First Publish Date - 2021-07-12T06:48:00+05:30 IST

మండలంలోని చందలూరు పీహెచ్‌సీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వీ.వెంకటేశ్వరరావుకు ఉద్యోగోన్నతి లభించింది.

పీహెచ్‌సీ సీనియర్‌ అసిస్టెంట్‌కు ఉద్యోగోన్నతి

దర్శి, జూలై 11 : మండలంలోని చందలూరు పీహెచ్‌సీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వీ.వెంకటేశ్వరరావుకు ఉద్యోగోన్నతి లభించింది. ఆయన ఒంగోలు రిమ్స్‌ సూపరిండెంట్‌గా ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు. చందలూరు పీహెచ్‌సీలో ఆయన సుమారు 9 సంవత్సరాలు పనిచేశారు. అదేవిదంగా దర్శి నియోజకవర్గ ఎన్‌జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడిగా నాలుగు దఫాలు పనిచేశారు. ఉద్యోగోన్నతిపై వెళ్తున్న వెంకటేశ్వరరావును ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు.

Updated Date - 2021-07-12T06:48:00+05:30 IST