పీడీసీసీబీలో కారుణ్య నియామకాలు

ABN , First Publish Date - 2021-01-13T05:34:42+05:30 IST

పీడీసీసీ బ్యాంకులో కారుణ్యనియామకం కింద ఇరువురిని ఉద్యోగాలలో నియమించారు. మంగళవారం ఒంగోలులోని బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో చైర్మన్‌ డాక్టర్‌ మాదాశి వెంకయ్య అందజేశారు.

పీడీసీసీబీలో కారుణ్య నియామకాలు
ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్న చైర్మన్‌ వెంకయ్య

ఒంగోలువిద్య, జనవరి 12 : పీడీసీసీ బ్యాంకులో కారుణ్యనియామకం కింద ఇరువురిని ఉద్యోగాలలో నియమించారు. మంగళవారం ఒంగోలులోని బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో చైర్మన్‌   డాక్టర్‌ మాదాశి వెంకయ్య అందజేశారు. బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తూ ఇటీవల జి.ఏసుపాదం మరణించడంతో ఆయన భార్య ప్రేమకుమారిని స్టాఫ్‌ అసిసెంట్‌గా, మెసెంజర్‌ కె.వెంకటేశ్వరరావు కుమారుడు కె.రవీంద్రప్రసాద్‌ను మెసెంజర్‌గా కారుణ్యనిమాకాల కింద నియమించారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్‌ నూర్‌అహమద్‌, సీఈవో శివకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-13T05:34:42+05:30 IST