విద్యార్థులను తీర్చిదిద్దిన జగన్నాథ్‌

ABN , First Publish Date - 2021-10-30T04:41:18+05:30 IST

విద్యార్థుల జీవితాలను చక్కగా తీర్చిదిద్దిన జగన్నాథ్‌ ఉత్తమ ఉపాధ్యాయుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని శాసనమండలి చైర్మన్‌ విఠపు బాలసుబ్రమణ్యం తెలిపారు. కంభం మండల రావిపాడు జడ్పీ హెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు టీ.ఎన్‌.జగన్నాథ్‌ ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం అదే పాఠశాలలో జరిగింది. ఎంఎల్‌సీతోపాటు రాష్ట్ర విద్యాశాఖమంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ముఖ్యఅతిథులుగా హాజరై హెచ్‌ఎంను ఘనంగా సన్మానించారు.

విద్యార్థులను తీర్చిదిద్దిన జగన్నాథ్‌
హెచ్‌ఎం జగన్నాథ్‌ను సన్మానిస్తున్న మంత్రి సురేష్‌, ఎమ్మెల్సీ విఠపు, ఎమ్మెల్యే రాంబాబు తదితరులు

హెచ్‌ఎం ఉద్యోగ విరమణసభలో ఎమ్మెల్సీ విఠపు

కంభం, అక్టోబరు 29 : విద్యార్థుల జీవితాలను చక్కగా తీర్చిదిద్దిన జగన్నాథ్‌ ఉత్తమ ఉపాధ్యాయుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని శాసనమండలి చైర్మన్‌ విఠపు బాలసుబ్రమణ్యం తెలిపారు.  కంభం మండల రావిపాడు జడ్పీ హెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు టీ.ఎన్‌.జగన్నాథ్‌ ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం అదే పాఠశాలలో జరిగింది. ఎంఎల్‌సీతోపాటు రాష్ట్ర విద్యాశాఖమంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ముఖ్యఅతిథులుగా హాజరై హెచ్‌ఎంను ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులు మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేవారు హృదయాల్లో నిలిచిపోతారన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన జగన్నాథ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జేడీ సుబ్బారావు, జేడీ రామలింగం, డీఎస్పీ కిశోర్‌కుమార్‌, డిప్యూటీ డీఈవో అనితారోజారాణి, మార్కాపురం మున్సిపల్‌ చైర్మన్‌ బాలమురళికృష్ణ, కంభం మండల ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, జడ్పీటీసీ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. 


ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి

రాచర్ల : ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటుందని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. రాచర్ల జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న ఎం.ఏసోబు శుక్రవారం ఉద్యోగ విరమణ  సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను మొదటి విడతగా నాడు-నేడు కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఏసోబు చేసిన సేవలను కొనియాడారు. అనంతరంహెచ్‌ఎం ఏసోబును ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఆర్‌జేడీ సుబ్బారావు, డిప్యూటీ డీఈవో రోజ్‌రాణి, తహసీల్దార్‌ ఇబ్రహీంఖలీల్‌, ఎంిపీడీవో మస్తాన్‌వలి, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారపేట ఎంఈవోలు, సీఆర్‌ఐ మురళి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-30T04:41:18+05:30 IST