మోడల్‌గా జగనన్న కాలనీలు

ABN , First Publish Date - 2021-12-31T05:49:20+05:30 IST

భవిష్యత్తులో జగనన్న కాలనీల్లో విద్యుత్‌, డ్రైనేజీ, మంచినీరు తదితర అన్ని వసతులు ఏర్పడతాయని, మోడల్‌ కాలనీలుగా రూపొందుతాయని సీఎంవో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. ఆయన గురువారం ఉదయం మార్టూరులోని గన్నవరం రోడ్డులో ఉన్న జగనన్న లేఅవుట్‌ను పరిశీలించారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జేసీ విశ్వనాథన్‌ తదితర అధికారులతో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న పక్కాగృహాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం జరుగుతున్నపుడు దశలవారీగా వారికి బిల్లులు మంజూరవుతాయన్నారు. వారం రోజుల్లో అందరికి రూ.35వేల రుణం అందే విధంగా చర్యలు చేపట్టాలని జేసీని ఆదేశించారు.

మోడల్‌గా జగనన్న కాలనీలు
జగనన్న కాలనీ పరిశీలనకు వచ్చిన సీఎస్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌, కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, హాసింగ్‌ జేసీ విశ్వ నాధన్‌

బిల్లులకు ఇబ్బంది ఉండదు

లబ్ధిదారులతో సీఎంవో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ 

మార్టూరు, డిసెంబరు 30: భవిష్యత్తులో జగనన్న కాలనీల్లో విద్యుత్‌, డ్రైనేజీ, మంచినీరు తదితర అన్ని వసతులు ఏర్పడతాయని, మోడల్‌ కాలనీలుగా రూపొందుతాయని సీఎంవో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. ఆయన గురువారం ఉదయం మార్టూరులోని గన్నవరం రోడ్డులో ఉన్న జగనన్న లేఅవుట్‌ను పరిశీలించారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జేసీ విశ్వనాథన్‌ తదితర అధికారులతో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న పక్కాగృహాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం జరుగుతున్నపుడు దశలవారీగా వారికి బిల్లులు మంజూరవుతాయన్నారు. వారం రోజుల్లో అందరికి రూ.35వేల రుణం అందే విధంగా చర్యలు చేపట్టాలని జేసీని ఆదేశించారు. వైసీపీ ఇన్‌చార్జ్‌ రావి రామనాథంబాబు, హౌసింగ్‌ పీడీ సాయిరాం, ఈఈ శేషుబాబు, డీఈ మురళి, డీఆర్‌డీఏ పీడీ బాబూరావు, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ చుండి సుజ్ణానమ్మ. ఎంపీపీ భుక్యా శాంతిబాయి, సర్పంచ్‌ భుక్యా సుమితాబాయి, తహసీల్దారు ఈదా వెంకటరెడ్డి, పఠాన్‌ కాలేషావలి, కాకోలు రామారావు, కాకోలు వెంకటేశ్వర్లు, గడ్డం మస్తానవలి, పంచాయతీ ఇన్‌చార్జ్‌ ఏఈ రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:49:20+05:30 IST