జగనన్న చీకటి పథకం

ABN , First Publish Date - 2021-10-15T04:54:46+05:30 IST

రానున్న రోజుల్లో రాష్ట్రంలో జగ నన్న చీకటి పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కాంగ్రెస్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి షేక్‌ సైదా అన్నారు.

జగనన్న చీకటి పథకం


కాంగ్రెస్‌ ఇన్‌చార్జి షేక్‌ సైదా

మార్కాపురం, అక్టోబరు 14: రానున్న రోజుల్లో రాష్ట్రంలో జగ నన్న చీకటి పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కాంగ్రెస్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి షేక్‌ సైదా అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలే క రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ ప్రజల సంక్షే మం కోసం రెండు నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒకటి కొవ్వొత్తుల పరిశ్రమ, రెండోది లాంతర్ల పరిశ్రమ అన్నారు. కరెంట్‌ను సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉం దన్నారు. జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో నవరత్నాలు గులక రా ళ్లుగా మారాయన్నారు. రాష్ట్రంలో 6 లక్షల రేషన్‌ కార్డులు తొల గించడం వైసీపీ దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు. ఈ ని యోజకవర్గ పరిధిలో  వైసీపీ వచ్చాక  28 మంది రెవెన్యూ ఉద్యో గులపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు సైదా తెలిపారు.  ఆయన తోపాటు డి.సుబ్బారావు, బడేసాహెబ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-15T04:54:46+05:30 IST