ప్రత్యేక హోదాను విస్మరించిన జగన్‌

ABN , First Publish Date - 2021-10-30T05:22:30+05:30 IST

రాష్ట్రంలో 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న సీఎం జగన్‌ అధికారం లోకి వచ్చాక విస్మరించారని జనసేన పార్టీ రాష్ట్ర కా ర్యదర్శి పెద్దపూడి విజయ్‌ ఆరోపించారు.

ప్రత్యేక హోదాను విస్మరించిన జగన్‌
సమావేశంలో మాట్లాడుతున్న విజయ్‌

ఛలో గాజువాకను విజయవంతం చేయాలి 

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌ పిలుపు


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 29 : రాష్ట్రంలో 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న సీఎం జగన్‌ అధికారం లోకి వచ్చాక విస్మరించారని జనసేన పార్టీ రాష్ట్ర కా ర్యదర్శి పెద్దపూడి విజయ్‌ ఆరోపించారు. శుక్రవా రం ఒంగోలులోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పరిశ్రమల ను కూడా కాపాడుకోలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. 34 మంది ప్రాణత్యాగాల ఫ లితంగా ఏర్పడ్డ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీ కరణ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుం టుంటే రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందిం చకపోవడం దుర్మార్గంగా ఉందన్నారు. దీనివల్ల జ రిగే నష్టాలను ముందుగానే గ్రహించిన తమ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ గత ఫిబ్రవరిలోనే కేంద్రప్ర భుత్వ పెద్దలను కలిసి ప్రైవేటీకరణ నిర్ణయంపై పు నరాలోచించాలని కోరారని వెల్లడించారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో మార్పు రాలేదని, ఈక్రమంలో విశాఖ ఉక్కుకు మద్దతుగా ఈనెల 31న గాజువాక లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నా యకులు చిట్టెం ప్రసాద్‌, రాయని రమేష్‌, ముత్యా ల కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T05:22:30+05:30 IST