పదవులు లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2021-12-16T04:39:48+05:30 IST

పార్టీపటిష్టం కోసం కష్టపడాలనే తత్వంతో కార్యకర్తలకు అండగా ఉండాలని సంకల్పించినట్లు కందుకూరు నియోజకవర్గ టీడీపీ యువనేత ఇంటూరి రాజేష్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంలోని ఉలవపాడు, రాజుపాలెం, కృష్ణాపురం గ్రామాల్లో పర్యటించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలను, కరోనాతో చనిపోయిన కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ తరుపున బాధిత కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేశారు.

పదవులు లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటా
బాధిత టీడీపీ కార్యకర్తలను పరామర్శిస్తున్న ఇంటూరి రాజేష్‌, తదితరులు

       -టీడీపీ యువనేత ఇంటూరి

ఉలవపాడు, డిసెంబరు 15 : పార్టీపటిష్టం కోసం కష్టపడాలనే తత్వంతో కార్యకర్తలకు అండగా ఉండాలని సంకల్పించినట్లు కందుకూరు నియోజకవర్గ టీడీపీ యువనేత ఇంటూరి రాజేష్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంలోని ఉలవపాడు, రాజుపాలెం, కృష్ణాపురం గ్రామాల్లో పర్యటించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలను, కరోనాతో చనిపోయిన కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు.  తెలుగుదేశం పార్టీ తరుపున బాధిత కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేశారు. ఉలవపాడు ఎస్సీ కాలనీలో కరోనాతో చనిపోయిన టీడీపీ సీనియర్‌ నాయకుడు దామతోటి వెంకట్రావు కుమారుడు ఇంజనీరింగ్‌ చదువులకు అవసరమైన మేరకు తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్‌ కార్యనిర్వాహణ కార్యదర్శి అమ్మనబ్రోలు రమేష్‌, మండల టీడీపీ అధ్యక్షుడు రాచగల్లు సుబ్బారావు, రాష్ట్ర బీసీ నాయకులు ఆవుల నరసింహరావు, మండల టీడీపీ సీనియర్‌ నాయకులు మక్కే నారాయణ, గ్రామపార్టీ అధ్యక్షుడు అంచుపోగు వాసు, మండల తెలుగు యువత అధ్యక్షుడు తొట్టెంపూడి మాల్యాద్రి, కందగడ్ల బ్రహ్మయ్య, చవిడిబోయిన హరిబాబు, అమ్మనబ్రోలు కృష్ణ, మానం శ్రీనివాసులు, కందగడ్ల సాయివరుణ్‌, అమ్మనబ్రోలు కిరణ్‌, విజయబాబు, మండల ఎస్సీసెల్‌ నాయకుడు రావినూతల రమేష్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-12-16T04:39:48+05:30 IST