రెడ్‌క్రా్‌సకు భవన సమస్య తీరేనా..?

ABN , First Publish Date - 2021-12-28T05:45:08+05:30 IST

నిస్వార్థసేవకు మారుపేరుగా రెడ్‌క్రాస్‌ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి.

రెడ్‌క్రా్‌సకు భవన సమస్య తీరేనా..?
14, 15 వార్డుల సచివాలయంగా ఉపయోగిస్తున్న భవనం

 ఇరుకు గదిలో నిర్వహణ

విస్తృత సేవా కార్యక్రమాల నిర్వహణకు పలు ఆటంకాలు

చీరాల, డిసెంబరు 27: నిస్వార్థసేవకు మారుపేరుగా రెడ్‌క్రాస్‌ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. చీ రాలలో ఒకప్పుడు రెడ్‌క్రా్‌సకు విశాలమైన ఆవరణతో పాటు సొంత భవనమూ ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. 1969కి ముందు బెస్తపాలెంలో రెడ్‌క్రా్‌సకు కా ర్యాలయం, విశాలమైన స్థలం ఉండేది. అప్పట్లో అక్క డ రెడ్‌క్రాస్‌ పరంగా విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ స్థలం దాతలు ఎవరు.. రెడ్‌క్రా్‌సకు ఎవరు ఇచ్చారనే దానిపై(అప్పటి చీరాల, పేరాల పంచాయతీల రికార్డులు పరంగా గాని ఆ తరువాత మున్సిపాల్టీపరంగాకాని) సరైన ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఆర్టీ యాక్టు ప్రకారం సమాచా రం కోరగా 1969లో ఆ స్థలాన్ని మున్సిపాల్టీకి బదలాయించారని గతంలో చీరాల మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన దేవ్‌సింగ్‌ రాతపూర్వకంగా తెలిపారు.

ఏం జరిగింది...

మున్సిపాలిటీకి ఆ స్థలం బదలాయించిన తరువా త అక్కడ మాతా,శిశుపోషణాలయం ఏర్పాటుచేశా రు. మిగిలిన స్థలంలో కొన్ని దుకాణాలను నిర్మించా రు. ఆ తరువాత కొంతమేర బహుళ అంతస్థుల భవ న నిర్మాణం జరిగింది. వాటిని అద్దెలకు ఇస్తున్నారు. వాటిపై వచ్చే రాబడి మున్సిపల్‌ ఖజానాకు జమవుతోంది. మాతా, శిశు పోషణాలయానికి కేటాయించిన భవనం శిథిలావస్థకు చేరింది. వారు ఆ భవనాన్ని వదిలేశారు. ప్రస్తుతం ఆ భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేసి, సున్నం పూసి 14, 15వార్డుల సచివాలయాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

కొన్నేళ్లుగా డాక్టరు హైమా సుబ్బారావు(గుంటుపల్లి సుబ్బారావు), ఇందుర్తి హనుమంతరావులు రెడ్‌క్రా్‌స కు పూర్వవైభవం తేవాలని భావించారు. మున్సిపల్‌ అధికారులు ఆ భవనంలో ఓ గదిని రెడ్‌క్రా్‌సకు కేటాయించారు. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆ గది సరిపోవటం లేదు. దీంతో పా టు ఎప్పుడు ఆ భవనం ప్రమాదానికి గురవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం ఆ భవనసముదాయం ఉన్న స్థలం అ త్యంత ప్రధానమైన వ్యాపారకూడలిలో ఉంది. దాని పరిధిలో ఉన్న దుకాణాల అద్దె, ఖాళీ ప్రదేశాల కేటాయింపుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భవనంలో కొంతభాగం శిథిలావస్థకు చేరింది. మొత్తం భవనాన్ని తొలగించి షా పింగ్‌ కాంప్లెక్స్‌తోపాటు రెడ్‌క్రా్‌సకు కొత్త భవనం ని ర్మిస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని, ఆ దిశగా అధికారులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అందరి సహకారం అవసరం

డాక్టరు గుంటుపల్లి సుబ్బారావు, రెడ్‌క్రాస్‌ కార్యదర్శి, చీరాల 

రెడ్‌క్రాస్‌ ద్వారా చేపట్టే విస్తృత కార్యక్రమాలకు అ నువైన భవనసముదాయం అవసరం. అందుకు సం బంధించి గతంలో రెడ్‌క్రాస్‌ కార్యకలాపాలు నిర్వహించిన భవనసముదాయంలోనే అన్ని వనరులు సమకూరేవిధంగా కేటాయించాలి. అప్పడే విస్తృతమైన సే వాకార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉంటుంది.


Updated Date - 2021-12-28T05:45:08+05:30 IST