మినుము సంరక్షణకు సూచనలు

ABN , First Publish Date - 2021-11-21T07:30:08+05:30 IST

మినుములో సమగ్ర సస్యరక్షణ చర్యలే చేపడితే అధిక దిగుబడులు సాదించవచ్చు అని జిల్లా వ్యవసాయ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు.

మినుము సంరక్షణకు సూచనలు

జేడీఏ శ్రీనివాసరావు

బడేవారిపాలెం (వలేటివారిపాలెం) నవంబరు 20 : మినుములో సమగ్ర సస్యరక్షణ చర్యలే చేపడితే అధిక దిగుబడులు సాదించవచ్చు అని జిల్లా వ్యవసాయ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని బడేవారిపాలెంలో సాగులో ఉన్న మినుముపంటను జేడీఏ శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులకు తెగులు నివారణకు పలు సూచనలు చేశారు.. ఏఏ తెగుళ్లకు ఏఏ క్రిమిసంహరక మందులు పిచికారి చేయాలనేది తెలియజేశారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖాదికారి హేమంత్‌భరత్‌కుమార్‌, రైతులు నల్లమోతు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం లింగసముద్రం మండలంలో పర్యటించారు. రాళ్లపాడు ప్రాజెక్టును సందర్శించారు. రైతులు ఈ-క్రాప్‌ నమోదు చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2021-11-21T07:30:08+05:30 IST