గాయపడిన వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-08-28T05:22:59+05:30 IST

తాళ్లూరు ఎస్సీకాలనీలో వివా హ వేడుకల వద్ద జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ అనపర్తి పెదబాబు(49) శు క్రవారం వేకువజామున మృ తి చెందారు.

గాయపడిన వ్యక్తి మృతి
పంచనామ నిర్వహిస్తున్న ఎస్సై నరసింహారావు

తాళ్లూరు, ఆగస్టు 27 : తాళ్లూరు ఎస్సీకాలనీలో వివా హ వేడుకల వద్ద జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ అనపర్తి పెదబాబు(49) శు క్రవారం వేకువజామున మృ తి చెందారు. స్థానిక ఎస్సీకాలనీలో సోమవారం ఓ ఇంట వివాహవేడుకలు జరుగుతుండగా హాజరైన అనపర్తి పెదబాబును అదేకాలనీకి చెందిన కంబంపాటి రంగయ్య రోకలితో తీవ్రంగా దాడిచేసి గాయపరిచాడు. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తీవ్రగాయాలై, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పెదబాబు గుంటూరు ప్రభు త్వ ఆసుపత్రిలో ఆరు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై నరసింహారావు హత్య కేసుగా నమోదు చేశారు. గుంటూరుకు వెళ్లి మృతదేహన్ని సందర్శించి, పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సానుభూతిపరునిగా ఉన్న పెదబాబును హత్య చేయడం దారుణమని టీడీపీ ఎస్సీ సెల్‌ మాజీ అధ్యక్షుడు అనపర్తి సుబ్బారావు, ఆవేదన వ్యక్తం చేశారు. బాబుమృతికి ఎంఆర్‌పీఎస్‌ నేత అనపర్తి ఆదాం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2021-08-28T05:22:59+05:30 IST