మహిళా మార్టుల్లో తక్కువ ధరకే సరుకులు

ABN , First Publish Date - 2021-12-30T05:39:20+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మహిళా మార్టులో ప్రజలకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే లభిస్తాయని మెప్మా స్టేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి అన్నారు.

మహిళా మార్టుల్లో తక్కువ ధరకే సరుకులు
సమావేశంలో మాట్లాడుతున్న డైరెక్టర్‌ విజయలక్ష్మి

మెప్మా స్టేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి 


అద్దంకి, డిసెంబరు 29 : ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మహిళా మార్టులో ప్రజలకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే లభిస్తాయని మెప్మా స్టేట్‌ మిషన్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి అన్నారు. జిల్లాలో తొలిసారిగా అద్దంకిలో జ గనన్న మహిళా మార్ట్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం అద్దంకి లోని వాసవి కల్యాణ మండపంలో మెప్మా సిబ్బంది, ఆర్పీలు, ఓబీలతో ని ర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా మార్టులో ప్రతి స్వ యం సహాయక సంఘ సభ్యురాలు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. డ్వాక్రా మహిళలు ఈ మార్టుల్లోని సరుకులను తక్కువ ధరలకు కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో మెప్మా పీడీ రవికుమార్‌, కమిషనర్‌ ఫజులుల్లా, ఎస్‌ఎంఎం ఆదినారాయణస్వామి, ఎన్‌ ఎన్‌ఆర్‌ శ్రీనివాస్‌, చక్రపాణి, చంద్రశేఖర్‌, సంపత్‌, శేఖర్‌, సీఎంఎం ఫణికు మారి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-30T05:39:20+05:30 IST