దోమల నిర్మూలనకు పాటు పడాలి

ABN , First Publish Date - 2021-08-21T06:12:12+05:30 IST

జిల్లాలో దోమల నిర్మూలనకు ప్రజలు భాగసా మ్యం కావాలని మలేరియా అధికారి డాక్టర్‌ సురేంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం ఒంగోలులో జిల్లా మ లేరియాశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

దోమల నిర్మూలనకు పాటు పడాలి
అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న సురేంద్రబాబు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 20 : జిల్లాలో దోమల నిర్మూలనకు ప్రజలు భాగసా మ్యం కావాలని మలేరియా అధికారి డాక్టర్‌ సురేంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం ఒంగోలులో జిల్లా మ లేరియాశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేం ద్రబాబు మాట్లాడుతూ ఆగస్టు 20న ఆడ వినాఫిలిస్‌ దోమ ద్వారా మలేరియా జ్వ రం వస్తుందని రొనాల్డ్‌దాస్‌ అనే శాస్త్రవేత్త కనుగోన్నారని తెలిపారు. అందువల్ల ప్రతి ఏటా ఆ రోజున ప్రపంచ దోమల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దో మలు కుట్టకుండా, పుట్టకుండా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమం లో మెడికల్‌ ఆఫీసర్‌ సుబ్బరాయుడు, నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎలిజబెత్‌, మంజే ష్‌, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి ఓంకార్‌, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-08-21T06:12:12+05:30 IST