అక్రమ అరెస్టులు..అడ్డగింతలు..!
ABN , First Publish Date - 2021-10-21T06:09:35+05:30 IST
టీడీపీ తలపెట్టిన బం ద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ అర్ధరాత్రి నుంచే హెచ్చరికలు చేశారు. ముందస్తు నోటీసుల పేరుతో హౌ స్అరెస్టులకు తెరతీశారు. ఆ తర్వాత అడుగడునా అడ్డగింతల తో అక్రమ అరెస్టులు చేసి, తమ ఓవర్ యాక్షన్ నిరూపించుకు న్నారు.

టీడీపీ బంద్‌ను అడ్డుకున్న పోలీసులు
వైసీపీ తీరుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
ముఖ్య నాయకులు, కార్యకర్తలు అరెస్ట్
దామచర్ల అరెస్టుతో నివాసం వద్ద ఉద్రిక్తత
ఒంగోలు(కార్పొరేషన్), అక్టోబరు 20 : టీడీపీ తలపెట్టిన బం ద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ అర్ధరాత్రి నుంచే హెచ్చరికలు చేశారు. ముందస్తు నోటీసుల పేరుతో హౌ స్అరెస్టులకు తెరతీశారు. ఆ తర్వాత అడుగడునా అడ్డగింతల తో అక్రమ అరెస్టులు చేసి, తమ ఓవర్ యాక్షన్ నిరూపించుకు న్నారు. తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కకుండానే పోలీసులు వారిని స్టేషన్లకు తరలించారు. వివరాల్లోకెళితే... తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడులు నిరసిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పి లుపుతో చేపట్టిన బంద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. బుధవా రం తెల్లవారుజామున నాలుగు గంటలకు తెలుగుతమ్ముళ్లు ఆ ర్టీసీ బస్సులను అడ్డుకునేందుకు డిపోకు వెళ్లారు. బస్సులు ని లిపివేయకుండానే వారిని అరెస్టులు చేసి వన్‌టౌన్‌కు తరలించా రు. ఉదయం 9గంటలకు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ నేతృత్వంలో నగరంలో బంద్‌ను జయప్రదం చేయడానికి సిద్ధం కాగా, బీకే ఎన్క్లేవ్ వద్ద దామచర్ల నివాసం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. డీఎస్పీ నాగరాజు దా మచర్లకు ముందస్తు నోటీసు జారీ చేసి హౌస్ అరెస్టు చేసి గం ట తర్వాత ఆయనను తాలూకా పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీని హౌ స్అరెస్టు చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి దామచర్ల స త్యకు వన్‌టౌన్ సీఐ సుభాషిణి నోటీసులు జారీ చేసి హౌ స్అరెస్టు చేశారు అదేవిధంగా దర్శి నియోజకవర్గ ఇన్చార్జి ప డిమి రమేష్ నేతృత్వంలో బంద్ నిర్వహించేందుకు కదిలిన తె లుగు తమ్ముళ్లను వన్‌టౌన్‌పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తర లించారు. దాంతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను టూటౌన్, స్టేషన్‌కు, తాలూకా స్టేషన్లకు తరలించి సాయం త్రం వరకు అక్కడే ఉంచి విడిచిపెట్టారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, ఎఎంసీ మాజీ చైర్మన్ కామేప ల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీని వాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకట రత్నం, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ, గంగ వరపు పద్మ, నాళం నరసమ్మ, మేరీ రత్నకుమారి, రాష్ట్ర కార్యద ర్శి రాయపాటి సీతమ్మ, కార్పొరేటర్లు వేమూరి అశ్విని, దాచర్ల వెంకటరమణయ్య, వేమూరి వెంకటేశ్వర్లు, కుమార్, గుర్రాల రాజ్ విమల్ పాల్గొన్నారు.
దామచర్ల నివాసం వద్ద ఉద్రికత్త
స్థానిక బీకే ఎన్‌క్లేవ్‌లోని దామచర్ల జనార్దన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముందస్తుగా హౌస్ అరెస్టు చేస్తున్నట్లు నో టీసులు జారీ చేసిన డీఎస్సీ నాగరాజు, ఆ తర్వాత అరెస్టు చేసి తాలూకా పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో టీడీపీ నాయ కులు, మహిళలు తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకోగా పోలీసుల కు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగానే భారీగా చేరుకున్న పోలీసులు దామచర్లను అరెస్టు చేయడంతో తెలుగు మహిళలు డీఎస్పీ కారు ముందు బైఠాయించి నినాదాలు చేశా రు. ఈక్రమంలో దామచర్ల నివాసంలో జరిగిన ఘటనతో ఇంటి తలుపు ధ్వంసం కాగా పలు వస్తువులు పాడైపోయాయి.
పమిడి.. ఆయన అనుచరులు అరెస్ట్
దర్శి నియోజకవర్గ ఇన్చార్జి పమిడి రమేష్ శ్రేణులతో కలిసి ఒంగోలులో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న క్రమంలో వ న్‌టౌన్ పోలీసులసు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రమేష్ అనుచరుల మధ్య జరిగిన వాగ్వాదంతో కొంత ఉద్రిక్త వాతావ రణం నెలకొంది. ఇదే సమయంలో కొందరు ఆకతాయిలు మెగా షాపింగ్ మార్ట్ అద్దాలు పగలగొట్టడంతో పోలీసులు అందరినీ అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి విచారించారు. ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ట్ అద్దాలు పగలగొట్టిన వారిపై కేసు నమోదు చేసి మిగిలిన నాయకు లను సాయంత్రం వరకు స్టేషన్ వద్దనే ఉంచి విడిచిపెట్టారు.