చరిత్ర గర్వంగా చెప్పుకునే పోరాటం

ABN , First Publish Date - 2021-01-20T06:45:48+05:30 IST

నూతన సాగు చట్టాల రద్దు కోసం ఢిల్లీలో 53 రోజులుగా అకుంఠిత దీక్షతో రైతాంగం చేస్తున్న పోరాటం చరిత్ర గర్వంగా చెప్పుకునే విధంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కొనియాడారు.

చరిత్ర గర్వంగా చెప్పుకునే పోరాటం
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణ

రైతుల ఉద్యమానికి ప్రతిఒక్కరూ మద్దతివ్వాలి

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఒంగోలు(జడ్పీ), జనవరి 19 : నూతన సాగు చట్టాల రద్దు కోసం ఢిల్లీలో 53 రోజులుగా అకుంఠిత దీక్షతో రైతాంగం చేస్తున్న పోరాటం చరిత్ర గర్వంగా చెప్పుకునే విధంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కొనియాడారు. వారికి మద్దతు గా స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో సీపీఐ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పొల్గొని మాట్లాడారు. రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ చట్టాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోరాటాల మీద విశ్వాసం ఉన్న ప్రతిఒక్కరూ రైతులు చేస్తున్న సహేతుక ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖా యమన్నారు.  టీడీపీ ఒంగోలు పార్లమెంటు స్థానం అధ్యక్షుడు నూక సాని బాలాజీ మాట్లాడుతూ రైతులు కోరుతున్న మద్దతు ధర అం శాన్ని చట్టంలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. మోదీ మోసపూరిత మాటలతో దేశప్రజలను వంచిస్తున్నారని సభకు అధ్యక్షత వహించిన రైతుసంఘాల కో-ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ చుండూరి రంగారావు విమర్శించారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈనెల 21న ఒంగోలులో నిర్వహించే ట్రాక్టర్ల ర్యాలీకి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘాలు కూడా మద్దతు ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనే యులు కోరారు. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, గోవిందు, సీపీఐ జిల్లా కార్య దర్శి ఎం.ఎల్‌.నారాయణ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, రైతుసం ఘం నాయకులు హనుమారెడ్డి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు పాలొ ్గన్నారు.


డీజీపీ తీరుపై విమర్శలు

రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ముందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ వ్యవహారశైలిపై సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు. ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో సంఘటన జరిగిన ప్రాంత పరిధిలోని ఎస్సై వెల్లడించాల్సిన వివరాల ను డీజీపీ చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రంలో అధికార, ప్రతి పక్షాలు రెండూ మోదీని చూసి భయపడుతున్నాయన్నారు. లౌకికవా దులైన చంద్రబాబు, జగన్‌లు బీజీపీ ఉచ్చులో చిక్కుకుని ఒకరు బొట్టు పెట్టుకుని, మరొకరు పంచె కట్టుకుని గుళ్ల చుట్టూ తిరుగు తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఏకగ్రీవమైన జడ్పీటీ సీలు, ఎంపీటీసీ స్థానాలను రద్దుచేసి మళ్లీ తాజా గా రీనోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆయన ఎలక్షన్‌ కమిషన్‌ను కోరారు.


Updated Date - 2021-01-20T06:45:48+05:30 IST