హెడ్‌కానిస్టేబుల్‌ మద్యం మత్తుకు యువకుడు బలి

ABN , First Publish Date - 2021-12-31T05:23:50+05:30 IST

పూటుగా మద్యం తాగిన ఏఆర్‌ కాని స్టేబుల్‌ మోటర్‌సైకిల్‌పై వెళుతూ యువకుడి ప్రాణం బలిగొన్నాడు.

హెడ్‌కానిస్టేబుల్‌ మద్యం మత్తుకు యువకుడు బలి
మృతి చెందిన దినేష్‌

బైక్‌తో ఢీకొట్టడంతో తీవ్రగాయాలు

చికిత్స పొందుతూ యువకుడు మృతి

ఆందోళనకు దిగిన దళిత సంఘాలు

ఏఆర్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

ఒంగోలు( క్రైం), డిసెంబరు 30: పూటుగా మద్యం తాగిన ఏఆర్‌ కాని స్టేబుల్‌ మోటర్‌సైకిల్‌పై వెళుతూ యువకుడి ప్రాణం బలిగొన్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి ఒంగోలు సౌత్‌ బైపాస్‌రోడ్డు మలుపులో చోటుచేసుకుంది. ప్రమాదంలో ప్రగతికాలనీకి చెందిన బొడ్డు దినేష్‌(23) మృతిచెందాడు. ఒంగోలు హెడ్‌ క్వార్టర్‌లో ఆర్మ్‌డు రిజర్వుడు హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచే సే చింటూరి శివకృష్ణ బుధవారం రాత్రి పూటుగా మద్యం తాగి తన స్వగ్రామమైన ఉలవపాడు వెళ్ళేందుకు బైక్‌పై బయలు దేరాడు. నగర శివారు సంఘమిత్ర ఆసుపత్రి సమీపంలో రోడ్డు మార్జిన్‌ లో నిలబడి ఉన్న బొడ్డు దినేష్‌ను ఢీకొట్టాడు. దీంతో దినేష్‌ తీవ్రంగా గా యపడి అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శివకృష్ణ కూడా గాయపడటంతో అతనిని మరో ఆసుపత్రి తరలించారు. 

విషయం తెలిసి పగతికాలనీకి చెందిన బంధువులు, బాధితుడి స్నేహి తులు అక్కడకు చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన బైక్‌లో ఇంకా మద్యం సీసాలు గుర్తించిన యువకులు ఆగ్రహానికి  గురయ్యారు. ప్రగతీ కాలనీ వాసులతో పాటుగా దళిత నాయకులు ఆందోళనకు దిగారు. కాని స్టేబుల్‌ను దాచిపెట్టారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరా త్రి వరకు ఆందోళన చేశారు. ఒంగోలు డీఎస్పీ నాగరాజు అక్కడకు చేరు కొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. గురువారం తెల్లవారుజామున దినే ష్‌ మృతిచెందాడు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున మృతుని బంధువులు, దళిత సంఘాల నాయకులు రిమ్స్‌ వద్ద ఆందోళనకు దిగారు. యువకుడు మృతికి కారణమైన ఏఆర్‌ హెడ్‌ కానిస్టే బుల్‌ శివకృష్ణను ఉద్యోగం నుంచి తొలగించాలని, మృతుని కుటుంబానికి ఉద్యోగం ఇప్పించాలని, రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో మంత్రి బాలినేని ప్రతినిధిగా వైసీసీ నాయకులు సింగరాజు వెంకట్రావు అక్కడకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలి పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఆందోళనలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు, దారా అంజయ్య, దేవరపల్లి రమణయ్య, దాసరి రాఘవులు, ధనరాజు పాల్గొన్నారు.

హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శివకృష్ణను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ మలికగర్గ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పూటుగా మద్యం తాగి యువకుని బలి తీసుకున్న శివకృష్ణ గతంలో రైలు దోపిడీ కేసులో నిందితుడు. ఇప్పటికీ అతనిపై కేసు నడుస్తోంది. దీంతో విషయాన్ని ఎస్పీ సీరియస్‌గా పరిగణించి అతనిపై చర్యలు తీసుకున్నారు. విచారణ అనంతరం కఠినమైన చర్యలు తీసుకుం టామని తెలిపారు.

Updated Date - 2021-12-31T05:23:50+05:30 IST