ఒంగోలులో జోరువాన

ABN , First Publish Date - 2021-11-02T05:54:29+05:30 IST

ఆల్పపీడనం ప్రభావంతో ఒంగోలులో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో బయటకు రాలేక ప్రజలు, వ్యాపారాలు చేసుకోలేక చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో పలు శివారు కాలనీల్లో నీరు నిలిచింది. మధ్నాహ్నం మూడు గంటల నుంచి వర్షం నిలిచిపోయినా జనసంచారం తక్కువగా కనిపించింది.

ఒంగోలులో జోరువాన
ఒంగోలు నగరంలోని కూరగాయల మార్కెట్లో నిలిచిన వర్షపు నీరు

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం

 శివారు కాలనీల్లో నిలిచిన వర్షపు నీరు

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 1 : ఆల్పపీడనం ప్రభావంతో ఒంగోలులో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో బయటకు రాలేక ప్రజలు, వ్యాపారాలు చేసుకోలేక చిరువ్యాపారులు  ఇబ్బందులు పడ్డారు.   ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో పలు శివారు కాలనీల్లో నీరు నిలిచింది. మధ్నాహ్నం మూడు గంటల నుంచి వర్షం నిలిచిపోయినా జనసంచారం తక్కువగా కనిపించింది. 

పంగులూరులో వర్షం

పంగులూరు  : మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఖరీ్‌ఫలో సాగు చేసిన మినుము, పత్తి తదితర పంటలకు జీవం పోసింది. రబీ సాగుకు సానుకూల వాతావరణం కల్పించింది. శనగ సాగు ఊపందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే  భూములు సిద్ధం చేసిన రైతులు నేల ఆరితే ఎరువు పెట్టి విత్తనాలు వెదబెట్టనున్నారు.  

 Updated Date - 2021-11-02T05:54:29+05:30 IST