ధ్యానంతోనే ఆరోగ్య జీవనం

ABN , First Publish Date - 2021-10-14T05:37:48+05:30 IST

నిత్యం క్రమబద్ధమైన ధ్యాన సాధనతోనే ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని విశాఖ పట్నంకు చెందిన ధ్యాన శిక్షకులు వంశీకిరణ్‌ పేర్కొన్నారు.

ధ్యానంతోనే ఆరోగ్య జీవనం
ప్రసంగిస్తున్న వంశీకిరణ్‌

ఒంగోలు (కల్చరల్‌), అక్టోబరు 13: నిత్యం క్రమబద్ధమైన ధ్యాన సాధనతోనే ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని విశాఖ పట్నంకు చెందిన ధ్యాన శిక్షకులు వంశీకిరణ్‌ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పిరమిడ్‌ స్పిరుచ్యువల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని తాతా లక్ష్మీప్రసాద్‌ కళ్యాణమండ పంలో బుధవారం నుంచి ప్రారంభమైన ధ్యాన దసరా మ హోత్సవాలలో తొలిరోజు ఆయన ధ్యానశిక్షణ కార్యక్రమం నిర్వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పిరమిడ్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు శిద్దా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ నిత్యం కేవలం రెండు నిమిషాలు ధ్యానం చేయ టం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుందన్నారు.  దీంతో అనేక ఉపయోగాలు  ఉన్నాయని చెప్పారు. కార్యక్రమం లో కనకారావు, వేణు, ప్రశాంతి, ర వితేజ సుధీర్‌ పాల్గొన్నారు. కాగా గురువారం భీమవరానికి చెందిన పిప్పళ్ల ప్రసాద్‌చే వేణుగానం ఉం టుందని నిర్వాహకులు తెలిపారు.  


Updated Date - 2021-10-14T05:37:48+05:30 IST