తెలుగుయువతలో పదవులు దక్కడంపై హర్షం

ABN , First Publish Date - 2021-12-31T06:28:58+05:30 IST

ఒంగోలు పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధులుగా ఎంపికైన తాతపూడి సుధీర్‌బాబు, ఫరూక్‌లు గురువారం ఆ పార్టీ ఇన్‌చార్జ్‌ ఉగ్రను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగుయువతలో పదవులు దక్కడంపై హర్షం

కనిగిరి, డిసెంబరు 30: ఒంగోలు పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధులుగా ఎంపికైన తాతపూడి సుధీర్‌బాబు, ఫరూక్‌లు గురువారం ఆ పార్టీ ఇన్‌చార్జ్‌ ఉగ్రను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీని గ్రామస్థాయి లో విస్తరించాలని ఆయన వారికి సూచించారు. అనంతరం వారిని డాక్టర్‌ ఉగ్ర సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఫిరోజ్‌, టీడీపీ ఎస్సీసెల్‌ నాయకులు బుల్లా బాలబాబు, భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు ఇంద్రభూపాల్‌రెడ్డి, ముస్లీం మైనార్టీ నాయకులు జంషీర్‌ అహ్మద్‌, రోషన్‌ సందాని, రిజ్వాన్‌, కరాటే యాసిన్‌, బ్రహ్మంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యక్షుడిగా వడ్డెంపూడి

పీసీపల్లి : ఒంగోలు పార్లమెంట్‌ తెలుగుయువత ఉపాధ్యక్షుడిగా పీసీపల్లి మండలం పోతవరం గ్రామానికి చెందిన వడ్డెంపూడి వెంకట్‌ చౌదరి (చిన్నా) నియమితు లయ్యారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ  ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సూచన మేరకు ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసానిబాలాజి వెంకట్‌చౌదరిను పార్లమెంట్‌ తెలుగుయువత ఉపాధ్యక్షుడుగా నియమించారు.

అధికార ప్రతినిధిగా రజ్జబ్‌బాషా

సీ.ఎస్‌.పురం : ఒంగోలు పార్లమెంట్‌ తెలుగు యువత అధికార ప్రతినిధిగా మండలంలోని కోవిలంపాడు గ్రామానికి చెందిన షేక్‌.రజ్జబ్‌బాషా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఒంగోలు పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు గురువారం నియామకపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రజ్జబ్‌బాషా మాట్లాడుతూ తనను అధికార ప్రతినిధిగా నియమించడానికి సహకరించిన కనిగిరి టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Updated Date - 2021-12-31T06:28:58+05:30 IST