హ్యాపీ క్రిస్మస్.. మెర్రీ క్రిస్మస్
ABN , First Publish Date - 2021-12-26T05:44:04+05:30 IST
జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి ఏసు పుట్టుకను స్వాగతిస్తూ ప్రారంభమైన సంబరాలు శనివారం అంతా కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రార్థనామందిరాలు క్రైస్తవ పరిజనంతో కిటకిటలాడాయి. ఏసు నామస్మరణతో మార్మోగాయి. ఆరాధనా గీతాలు వీనుల విందు చేశాయి. చర్చిల్లో జరిగిన సామూహిక ప్రార్థనల్లో పలువురు ప్రముఖులు పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా సంబరాలు
కిటకిటలాడిన ప్రార్థనా మందిరాలు
సామూహిక ప్రార్థనలు
ఒంగోలు , డిసెంబరు 25 :
జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి ఏసు పుట్టుకను స్వాగతిస్తూ ప్రారంభమైన సంబరాలు శనివారం అంతా కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రార్థనామందిరాలు క్రైస్తవ పరిజనంతో కిటకిటలాడాయి. ఏసు నామస్మరణతో మార్మోగాయి. ఆరాధనా గీతాలు వీనుల విందు చేశాయి. చర్చిల్లో జరిగిన సామూహిక ప్రార్థనల్లో పలువురు ప్రముఖులు పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్లు దైవ వాక్యం చదివారు. ఒంగోలులోని ప్రముఖ జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో పాస్టర్ డాక్టర్ డి.జాన్‌అగస్టీన్ సందేశం వినిపించారు. ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు చూపిన కరుణామార్గంలో నడవాలని కోరారు. ఈ సందర్భంగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు.