గుప్త నిధుల కోసం తవ్వకాలు
ABN , First Publish Date - 2021-08-23T05:21:16+05:30 IST
మండలంలోని వలపర్ల పంచాయతీ సమీపంలో జంగమ హేశ్వరపురంకు చెం దిన ఎర్రమట్టి కొండ పై గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధు ల కోసం తవ్వకాలు చేపట్టారు.
మార్టూరు, ఆగస్టు 22: మండలంలోని వలపర్ల పంచాయతీ సమీపంలో జంగమ హేశ్వరపురంకు చెం దిన ఎర్రమట్టి కొండ పై గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధు ల కోసం తవ్వకాలు చేపట్టారు. ఎత్తైన కొండపై వారం రోజుల నుంచి రాత్రిళ్లు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం రావడంతో ఆదివారం ఎస్‌ఐ పి.చౌడ య్య, పోలీసు సిబ్బంది, అద్దంకి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన జై భా రత్ సంస్థ ప్రతినిధులు తాళ్లూరి వెంకటకృష్ణ తదితరులతో కలిసి కొండ ప్రాం తాన్ని పరిశీలించారు. అక్కడ కొంతమంది గొర్రెల కాపరులు సహాయంతో గుప్త నిదుల కోసం తవ్విన గుంటను పోలీసులు పరిశీలించారు. 15 అడుగులు లోతు వరకు గుంట తవ్వారని ఎస్‌ఐ చౌడయ్య తెలిపారు. అందుకు సం బంఽధించి పలుగు, పార అక్కడ ఉన్నాయని చెప్పారు. గుంట పక్కన సమీ పంలో చెట్టుకు పూజలు చేసినట్లుగా పసుపు, కుంకుమ ఉన్నాయని పేర్కొ న్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు గురించి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.