రైల్వేస్టేషన్‌లో గుంటూరు డివిజనల్‌ మేనేజర్‌ తనిఖీ

ABN , First Publish Date - 2021-08-27T05:46:21+05:30 IST

దొనకొండ రైల్వేస్టేషన్‌ను గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ మోహన్‌రాజా గురువారం తనిఖీ చేశారు.

రైల్వేస్టేషన్‌లో గుంటూరు డివిజనల్‌ మేనేజర్‌ తనిఖీ
స్టేషన్‌ను తనిఖీ చేస్తున్న రైల్వే డివిజనల్‌ మేనేజర్‌

దొనకొండ, ఆగస్టు 26 : దొనకొండ రైల్వేస్టేషన్‌ను గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ మోహన్‌రాజా గురువారం తనిఖీ చేశారు. గుంటూరు నుంచి నంద్యాల వరకు చేపట్టే తనిఖీల్లో భాగంగా దొనకొండను సందర్శించారు. గుంటూరు నుంచి డీఆర్‌ఎం ప్రత్యేక రైలు ఉదయం 8-30 గంటలకే దొనకొండ రైల్వేస్టేషన్‌కు చేరింది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న బుకింగ్‌ కౌంటర్‌, స్టేషన్‌ మాష్టర్‌ కార్యాలయం, సిగ్నలింగ్‌ వ్యవస్ధ, టికెట్లు ఇచ్చే కార్యాలయాలను డీఆర్‌ఎం తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం శ్రీనివాస్‌, డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ కేఎ్‌స.హరప్రసాద్‌, గుంటూరు డివిజనల్‌ స్థాయి ఉన్నతాధికారులు,  రైల్వే రక్షకదళం ఇన్‌చార్జ్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

భరోసా ఇవ్వని డీఆర్‌ఎం పర్యటన 

 దొనకొండ రైల్వేస్టేషన్‌కు చేరిన గుంటూరు రైల్వే డివిజన్‌ మేనేజర్‌కు రైల్వేపరమైన పలు సమస్యలను విన్నవించేందుకు పలువురు స్థానికులు సిద్ధమయ్యారు.  దొనకొండ రైల్వేస్టేషన్‌లో అమరావతి, ప్రశాంతి, గరీబ్‌రథ్‌, కొండవీడు తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు స్టాపింగ్‌ లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం డీఆర్‌ఎంకు విన్నవించుకునేందుకు స్టేషన్‌కు వచ్చారు. అయితే. డీఆర్‌ఎం ప్రత్యేక రైలు కొద్దిసేపటికే దొనకొండ నుండి బయలుదేరడంతో వారు వెనుతిరిగారు.

Updated Date - 2021-08-27T05:46:21+05:30 IST