రెండు గేట్ల ద్వారా గుండ్లకమ్మ నీరు విడుదల
ABN , First Publish Date - 2021-11-21T05:54:08+05:30 IST
గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు శని వారం కూడా వరద ఉధృతి కొనసాగింది.

మద్దిపాడు, నవంబరు 20 : గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు శని వారం కూడా వరద ఉధృతి కొనసాగింది. ప్రాజెక్టు ఉన్నతాధికా రులు ఆదేశాలు మేరకు ఎగువ 10వేల క్యూసెక్కులు వరద నీరు వస్తుండగా 5వేల క్యూసెక్కులను బయటకు విడుదల చే స్తున్నట్లు డీఈ బొల్లయ్య తెలిపారు. ప్రాజెక్టులో 22.8 మీటర్ల నీ టిమట్టం ఉందని ఆయన చెప్పారు.