14న అయ్యప్పస్వామి గ్రామోత్సవం

ABN , First Publish Date - 2021-01-13T06:01:32+05:30 IST

ఈనెల 14 వతేది మకరసంక్రాంతి పర్వదినం సంధర్బంగా ఎర్రగొండపాలెంలోని అయ్యప్పస్వామి దేవాలయం నుంచి ఉదయం 9 గంటలకు అయ్యప్పస్వామి విగ్రహాంతో గ్రామోత్సవం ప్రధర్శన నిర్వహించబడుతుందని ఆలయ కమిటి అధ్యక్షులు కందూరి రామయ్య మంగళవారం తెలిపారు.

14న అయ్యప్పస్వామి గ్రామోత్సవం


  ఎర్రగొండపాలెం, జనవరి 12 :  ఈనెల 14 వతేది  మకరసంక్రాంతి పర్వదినం సంధర్బంగా ఎర్రగొండపాలెంలోని అయ్యప్పస్వామి దేవాలయం నుంచి ఉదయం 9 గంటలకు అయ్యప్పస్వామి విగ్రహాంతో గ్రామోత్సవం ప్రధర్శన నిర్వహించబడుతుందని ఆలయ కమిటి అధ్యక్షులు కందూరి రామయ్య మంగళవారం తెలిపారు. అయ్యప్పస్వామి ఆలయం నుంచి  అయ్యప్పస్వామి విగ్రహంతో ఎర్రగొండపాలెంలోని ప్రధాన వీధుల గుండా గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు  స్థానిక అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి భక్తులతో పడిపూజ, మకరజ్యోతి ధర్శనం కార్యక్రమాలు నిర్వహించబడుతాయని తెలిపారు. ఎర్రగొండపాలెం పట్టణ ప్రజలు, అయ్యప్పస్వామి భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు.


Updated Date - 2021-01-13T06:01:32+05:30 IST