ఆక్వా సాగు అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2021-10-29T06:30:09+05:30 IST
ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక పురోగతికి ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తోందని మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్‌రెడ్డి
కనిగిరి, అక్టోబరు 28: ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక పురోగతికి ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తోందని మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మత్య్సకారులతో స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆక్వా అభివృద్ధికి కృషి చేసే క్రమంలో కనిగిరి ప్రాంతంలో ఆక్వా హబ్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనుందన్నారు. ఇందుకోసం కనిగిరి ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు అనుకూలమైన ప్రదేశంలో రూ. 1.40 కోట్లతో ఆక్వా హబ్‌ను నిర్మించున్నట్లు తెలిపారు. ఇక నుంచి చేపలు, రొయ్యలు తదితరాలు ఆక్వా హబ్ నుంచే వ్యాపారులు కొనుగోలు చేయాలని నిబంధనలు పెడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా హబ్ నుంచి కొనుగోలు చేసే వ్యాపారులు తప్పని సరిగా ఒక రూమును ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందుకోసం ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. గ్రామాల్లో, పట్టణంలో చేపలు, రొయ్యలు అమ్మకాలు చేపట్టాలంటే తప్పనిసరిగా హబ్ నుంచి కొనుగోలు చేసే వద్ద మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. త్వరలో గ్రామ, వార్డు, సచివాలయాల్లో శుద్ధి చేసిన చేపలు, రొయ్యలను అందుబాటులో కి తెస్తామన్నారు. సమావేశంలో చీరాల ఏడి రంగనాధబాబు, ఒంగోలు ఏడి ఉషాకిరణ్, మత్య్సశాఖ ఇన్స్‌పెక్టర్ ఏ పొట్టెయ్య తదితరులు పాల్గొన్నారు.
పామూరులోని రైతు భరోసా కేంద్రంలో వ్యాపారులు, మత్స్యకారులతో గురువారం సమావేశం నిర్వహించి ఆక్వా హబ్‌లపై అవగాహన కార్యక్రమం కల్పించారు. స్థానిక రైతుభరోసా కేంద్రానికి విచ్చేసిన మత్యశాఖ జేడీ చంద్రశేఖర్‌ను పామూరు సొసైటి సభ్యులు గురువారం కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట మత్స్యశాఖ ఏడీలు, సిబ్బంది, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.