గోపుర నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-07-08T06:29:46+05:30 IST

మండలంలోని వెల్లుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీకాశినాయన స్వామి దేవాలయంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోపుర నిర్మాణానికి శంకుస్థాపన
కాశినాయన ఆలయంలో పూజలు నిర్వహించిన ఎంపీ మాగుంట


గిద్దలూరు, జూలై 7 : మండలంలోని వెల్లుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీకాశినాయన స్వామి దేవాలయంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన గాలిగోపుర నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సమీపంలో నిర్మించిన డైనింగ్‌ హాలును ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు దేవాలయాలు ఎంతగానో దోహద పడుతున్నాయని  మాగుంట అన్నారు. వెల్లుపల్లి వెళ్తూ గిద్దలూరులోని రాచర్లగేటు సెంటర్‌లో వైఎస్సార్‌ విగ్రహానికి మాగుంట పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, వెల్లుపల్లి సర్పంచ్‌ ఏరువ రాజశేఖర్‌రెడ్డి, మాజీ  జడ్పీటీసీ కుప్పా రంగనాయకులు, మాజీ  ఎంపీపీలు మేడం గోపాల్‌రెడ్డి, మానం వెంకటరెడ్డి, వివిధ వర్గాల ప్రతినిధులు మీనిగ రాజశేఖర్‌రెడ్డి, ఏరువ బాలవెంకటరెడ్డి, పేరం కాశిరెడ్డి, కంకర రామశంకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-08T06:29:46+05:30 IST