ఏళ్లు గడుస్తున్నా..గూళ్లు కరువే..!

ABN , First Publish Date - 2021-12-31T04:54:17+05:30 IST

అధికారుల ఉదాసీనత, పాలకుల నిర్లక్ష్యం వెరసి మదర్‌థెరిస్సా కాలనీలో పేదలకు పక్కా ఇళ్లు తీరని కలగానే మిగిలింది.

ఏళ్లు గడుస్తున్నా..గూళ్లు కరువే..!
మదర్‌ థెరిస్సా కాలనీలో నిలిచిన గృహ నిర్మాణాలు

వసతుల లేమితో నిలిచిన 

ఇంటి నిర్మాణాలు

ఆందోళన చెందుతున్న పేద లబ్ధిదారులు

పట్టించుకోని అధికారులు, 

ప్రజాప్రతినిధులు

కంభం, డిసెంబరు 30 : అధికారుల ఉదాసీనత, పాలకుల నిర్లక్ష్యం వెరసి మదర్‌థెరిస్సా కాలనీలో పేదలకు పక్కా ఇళ్లు తీరని కలగానే మిగిలింది. 16 ఏళ్ల క్రితం ఇళ్ల పట్టాలు మంజూరైనా ఆ ప్రాంతంలో మౌ లిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా నేటికీ ఇంటి నిర్మాణాలు పూర్తికాలేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే కందులాపురం పంచాయతీలో 2007-08 ఎస్సీ, ఎస్టీలు 226 మందికి గృహ నిర్మాణాల కు  ఇంటి పట్టాలు మంజూరు చేశారు. అయితే రో డ్డు నిర్మాణాలు, నీటి సౌకర్యం కల్పించకపోవడంతో కే వలం 36 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వీటిలో 10కిపైగా ఇళ్లు పూర్తికాగా మిగిలినవి పునాది దశలోనే నిలిచిపోయాయి. కాలనీకి వెళ్లేందుకు రైల్వే స్థలాన్ని వినియోగించుకోవడం వలన ఆశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ విషయంపై గతంలో పలు సంఘాల నాయకులు బాధితల పక్షాన రెవెన్యూ అధికారులకు తెలియ చేసినప్పటికీ అప్పటి తహసీల్దార్‌ హుస్సేన్‌పీరా మార్కెట్‌యార్డు పక్క నుంచి కాలనీకి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఏర్పాటు చే సేందుకు సర్వేయర్లతో కొలతలు వేయించి చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇప్పటికి 15 మంది తహసీల్దార్లు మారినా ఆ ఊసే మరిచారు. కాలనీలో తాగునీటి సౌక ర్యం మంజూరు చేసేందుకు జిల్లాలోనే మొదటిసారిగా  ఐటీడీటీ పథకం కింద రూ.15.73 లక్షలతో 10వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న మంచినీటి పథకాన్ని పూర్తి చేశారు. ట్యాంక్‌ నిర్మాణం పూర్తయి కాలనీలో స గానికిపైగా పైపులైన్‌ వేశారు. నిధులు చాలకపోవడంతో పనులు నిలిచిపోయాయి. నీరులేక గృహ నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచాయి. గృహ నిర్మాణానికి వ స్తువులు తీసుకెళ్లేందుకు దారి లేకుండా పోయింది. రోడ్డు ఎప్పుడు వేస్తారోనని ఎదురు చూస్తున్నారు. కరెంట్‌ సౌకర్యం కల్పించినా కంపచెట్లు ఉండడంతో పాములు, తేళ్లు తిరుగుతున్నాయని, భయంతో నివసిస్తున్నామని బాధితులు ఎం.దానమ్మ, ఎం.సుగుణమ్మ తెలిపా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీకి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.


Updated Date - 2021-12-31T04:54:17+05:30 IST