పని చేయకుంటే బదిలీపై వెళ్లిపోండి
ABN , First Publish Date - 2021-11-06T04:48:20+05:30 IST
కంభం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు సరైన వైద్యం అందించలేని డాక్టర్లు, సిబ్బంది ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవచ్చని గిద్దలూరు శాసనసభ్యుడు, వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నా వెంకట రాంబాబు తెలిపారు. శుక్రవారం కంభం ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శశికాంత్ వైద్యశాలలో డాక్టర్ల కొరత, గైనకాలజిస్టు లేకపోవడం వలన కలుగుతున్న ఇబ్బందులు, వైద్యశాల అభివృద్ధికి చేసిన ఖర్చులను ఎమ్మెల్యే రాంబాబుకు వివరిస్తుండగా కంభం సర్పంచ్ బోడయ్య లేచి కంభం వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదని, ఇక్కడ పని చేసే డాక్టర్లు, సిబ్బంది రోగులకు వైద్యం అందించకుండా నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపిస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే రాంబాబు
కంభం, నవంబరు 5 : కంభం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు సరైన వైద్యం అందించలేని డాక్టర్లు, సిబ్బంది ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవచ్చని గిద్దలూరు శాసనసభ్యుడు, వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నా వెంకట రాంబాబు తెలిపారు. శుక్రవారం కంభం ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శశికాంత్ వైద్యశాలలో డాక్టర్ల కొరత, గైనకాలజిస్టు లేకపోవడం వలన కలుగుతున్న ఇబ్బందులు, వైద్యశాల అభివృద్ధికి చేసిన ఖర్చులను ఎమ్మెల్యే రాంబాబుకు వివరిస్తుండగా కంభం సర్పంచ్ బోడయ్య లేచి కంభం వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదని, ఇక్కడ పని చేసే డాక్టర్లు, సిబ్బంది రోగులకు వైద్యం అందించకుండా నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపిస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా వైద్యశాలలో పని చేసే డాక్టర్ రామలింగమ్మపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. స్పందించిన ఎమ్మెల్యే రాంబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ రామలింగమ్మను పిలిపించి ఆరోపణలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అలాగే హెడ్‌నర్సు పద్మ కూడా వైద్యశాలలో జరిగే ప్రతి విషయాన్ని బయటి వారికి చేరవేస్తూ వైద్యశాల పరువు తీస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదన్నారు. మీకు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే బదిలీపై వెళ్లండి, కావాలంటే నేను సహకరిస్తాను, ఏ పని మీకు చేతకాదంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదని మండిపడ్డారు. ఎవరైనా పని చేయని పక్షంలో ఉన్నతాధికారులతో మాట్లాడి బదిలీ చేయిస్తానని హెచ్చరించారు. అనంతరం డాక్టర్ శశికాంత్ సూచనల మేరకు కంభం 50 పడకల వైద్యశాలకు గైనకాలజిస్టును త్వరలో ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఫోన్‌లో తెలిపారు. అలాగే డాక్టర్ రామలింగమ్మపై, 3 సంవత్సరాలుగా డిప్యుటేషన్‌పై గుంటూరులో ఉంటున్న దంతవైద్యురాలు డాక్టర్ ఆరతిభూషన్‌పై జిల్లా కోఆర్డినేటర్ ఉషాకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, జడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి, సర్పంచ్ రజని, అభివృద్ధి కమిటీ మెంబర్లు సాంబశివారెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.