ఘనంగా వాజ్‌పేయి జయంతి

ABN , First Publish Date - 2021-12-26T06:38:00+05:30 IST

మాజీ ప్రధాని అటల్‌ బిహరీ వాజ్‌పేయి జయంతి వేడుకలను దర్శిలో శనివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వాజ్‌పేయి జయంతి
దర్శిలో పండ్లు పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు

దర్శి, డిసెంబరు 25 : మాజీ ప్రధాని అటల్‌ బిహరీ వాజ్‌పేయి జయంతి వేడుకలను దర్శిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు టి.నారాయణరెడ్డి నియోజకవర్గ కన్వీనర్‌ ఎం.శ్రీనివాసరావులు స్థానిక సాయిబాబా ఆశ్రమంలోని వృద్ధులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కె నాగభూషణం, ఏ శరత్‌, కే.అనీల్‌, గురవర్ధన్‌ పాల్గొన్నారు.

లింగసముద్రం : దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలు మండల బీజేపీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. లింగసముద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అఽధ్యక్షులు మట్లె ఏడుకొండలు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, ప్రభు, కార్యదర్శి సుబ్బారావు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు చొప్పర ఆంజనేయులు, కొట్టె వెంకటాద్రి నాయుడు, మనోజ్‌ పాల్గొన్నారు. 

పామూరు, డిసెంబరు 25: భారతదేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా సేవలు చేసినా ఒక్క అవినీతి మచ్చ లేకుండా స్వచ్చమైన పరిపాలన అందించిన ఘనత స్వర్గీయ వాజ్‌పేయికే దక్కిందని బీజేపీ ఒంగోలు పార్లమెంటు బిల్డింగ్‌ కమిటీ చైర్మన్‌ కెవి రమణయ్య అన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో మండలశాఖ ఆద్వర్యంలో భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆరెకొండ సురేష్‌, కె సుబ్బారావు, జె చిన్నసుబ్బయ్య, పవన్‌తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T06:38:00+05:30 IST