ఘనంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-29T04:55:15+05:30 IST

ఒంగోలు మండలం యరజర్ల పంచాయతీ ప రిధిలోని మంగళాద్రిపురంలో గంగా భవానీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్స వాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు
గంగాభవానీ అమ్మవారిని దర్శించుకున్న దామచర్ల జనార్దన్‌

ఒంగోలు(రూరల్‌), అక్టోబరు 28: ఒంగోలు మండలం యరజర్ల పంచాయతీ ప రిధిలోని మంగళాద్రిపురంలో గంగా భవానీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్స వాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు. ముందుగా గ్రామస్థులు దామచర్లకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గుం డపననేని శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వ రరావు తదతరులు పాల్గొన్నారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే శన శంకరరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.  కార్యక్రమంలో నాయకులు దమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం, సర్పంచ్‌ రాములమ్మ, తమ్మిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు.  

  

Updated Date - 2021-10-29T04:55:15+05:30 IST