ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ జయంతి

ABN , First Publish Date - 2021-10-20T05:55:26+05:30 IST

మిలాద్‌ ఉన్‌ నబీ జయంతి వేడుకలను జేఐహెచ్‌, ఎస్‌ఐవో సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ జయంతి


గిద్దలూరు, అక్టోబరు 19 : మిలాద్‌ ఉన్‌ నబీ జయంతి వేడుకలను జేఐహెచ్‌, ఎస్‌ఐవో సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా దివ్యాంగ విద్యార్థినులు, అనాథ పిల్లలకు ఆహార పదార్థాలు అందచేశారు. ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్‌బాషా మాట్లాడుతూ మిలాద్‌ ఉన్‌ నబీ అంటే అం తిమ దైవ ప్రవక్త మహమ్మద్‌ జన్మ దినం అని, ఇది ఏ ఒక్క ప్రాంతానికో, వర్గానికో చెందినది కాదన్నారు. యావత్‌ ప్రపంచ మానవాళికి మార్గదర్శిగా ఆయన నిలిచారన్నారు. ప్రతి ఒ క్కరూ దైవమార్గంలో ధర్మపథంలో నడవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ నా యబ్‌రసూల్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఖాదర్‌ఖాన్‌, మాజీ ఉపసర్పంచ్‌ రఖీబ్‌, ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి మస్తాన్‌వలి, వివిధ వర్గాల ప్రతినిధులు వలి, అబ్దుల్‌, అక్బర్‌వలి పాల్గొన్నారు. 

మహమ్మద్‌ ప్రవక్త జీవితం ఆదర్శనీయం

మార్కాపురం : మహమ్మద్‌ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శనీయమని ఎంపీజే రాష్ట్ర కో శాధికారి షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ అన్నారు. మిలాద్‌ ఉన్‌ నబీ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పాఠశా లలో విద్యార్థులకు నిత్యావసరాలు, పండ్లు పం పిణీ చేశారు. ఈ సందర్భంగా రజాక్‌ మా ట్లాడుతూ మహమ్మద్‌ ప్రవక్త శత్రువులను సైతం క్షమించిన దయాగుణాన్ని ప్రజలకు అం దించారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉ పాధ్యక్షుడు సయ్యద్‌ గఫార్‌, ఎంపీజే నాయ కులు ఖాసిం, నాగూర్‌మీరావలి, మహబూబ్‌ ఖాన్‌, షేక్‌ అమీర్‌ పాల్గొన్నారు. 

రాచర్లలో..

రాచర్ల : మండలంలోని ముస్లింలు మంగళవారం పవిత్రమైన మిలాద్‌ ఉన్‌ నబి జయంతిని  ఘనంగా నిర్వహించారు. మసీదులలో ప్రత్యేక నమాజ్‌లు చేశారు. అనుమలవీడు, గౌతవరం, గుడిమెట్ట, ఆకవీడు, ఆరవీటికోట, రాచర్ల గ్రామాలలోని మసీదులలో మతపెద్దలు మహమ్మద్‌ ప్రవక్త పుట్టుక, ఇస్లాం గురించి వివరిం చారు. ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమాలలో ముస్లిం పెద్దలు షేక్‌ మహమ్మద్‌రఫి, జఫ్రుల్లాఖాన్‌, మహబూబ్‌పీరా, నాయబ్‌రసూల్‌, మునాఫ్‌ పాల్గొన్నారు.Updated Date - 2021-10-20T05:55:26+05:30 IST