జాతీయోద్యమ నేతలను అవమానించడం తగదు

ABN , First Publish Date - 2021-10-26T05:03:31+05:30 IST

దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను అవమానించడం తగదని దళిత హక్కుల వేదిక, కాంగ్రె్‌సపార్టీ నాయకులు పేర్కొన్నారు.

జాతీయోద్యమ నేతలను అవమానించడం తగదు
ఎస్‌ఐ జి.రామిరెడ్డికి చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ వినతిపత్రం

దళిత హక్కుల వేదిక, కాంగ్రెస్‌ నాయకులు

కనిగిరి, అక్టోబరు 25 :  దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను అవమానించడం తగదని దళిత హక్కుల వేదిక, కాంగ్రె్‌సపార్టీ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని గాంధీజీ, అంబేద్కర్‌ విగ్రహాలకు వైసీపీ జెండాలు, కండువాలు వేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయా విగ్రహాలకు పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. మహాత్ములు అందించిన త్యాగాల ఫలితమే నేడు భారతావని స్వేచ్ఛా వాయువులు పీలుస్తోందన్నారు. అటువంటి వారి విగ్రహాలకు వైసీపీ జెండాలు, కండువాలు వేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల వేదిక నాయకులు దానయ్య, కాంగ్రె్‌స పార్టీ నాయకులు పాల్గొన్నారు. 


విద్రోహులపై చర్యలు తీసుకోవాలి

నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌

కనిగిరి, అక్టోబరు 25: డాక్టర్‌ బాబా అంబేద్కర్‌, జాతిపిత మహత్మాగాంధీ విగ్రహాలకు వైసీపీ కండువాలు, జెండాలు కప్పి అవమాన పరిచిన విద్రోహులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ కోరారు. ఈ ఘటనకు నిరసనగా వైసీపీ నాయకులు సోమవారం అంబేద్కర్‌, గాంధీజీ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ గిట్టనివారు మహనీయులను అవమానపరిచే విధంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కొంతమంది కుట్రపూరితంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. విద్రోహులకు గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఎస్‌ఐ  జి.రామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవీసత్ర సముదాయాల చైర్మన్‌ దేవకి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు దేవకి రాజీవ్‌, శ్రీరామ్‌ సతీష్‌, మాణిక్యరావు, వైసీపీ నాయకులు రంగనాయకులరెడ్డి, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, రహీం, బొర్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:03:31+05:30 IST