వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-10-29T05:19:19+05:30 IST

మండల పరిధిలో జాతీయరహదారిపై గురు వారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాలలో నలుగురు గాయ పడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

మార్టూరు, అక్టోబరు 28: మండల పరిధిలో జాతీయరహదారిపై గురు వారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాలలో నలుగురు గాయ పడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం 8 గంటల సమయంలో కోలలపూడి రోడ్డు వద్ద గుంటూరు నుంచి ఒం గోలు వైపు వెళ్లే రోడ్డులో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ద్విచక్ర వాహనంపై  బి.దేవమనోహర్‌, జి.శ్రీరాయమూర్తి తిరుమల వెళుతున్నారు. ప్రమా దంలో బైక్‌ నడుపుతున్న దేవమనోహర్‌కు  తీవ్రగాయాలు కాగా, హైవే ఆంబులెన్స్‌లో ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 

జొన్నతాళి సెంటరులోని  పెట్రోలు బంకు సమీపంలో ఉదయం 11 గంటల సమయంలో మరో ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెం దిన వేణు, మరొకరు ద్విచక్రవాహనంపై వ్యక్తిగత పనులు నిమిత్తం ఇసుకదర్శి వెళుతున్నారు. ఈక్రమంలో రోడ్డు పక్కన ఉన్న హాటల్‌ నుండి ఒక వ్యక్తి సడన్‌గా ద్విచక్రవాహనంపై రోడ్డు మీదకు రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వేణుకు గాయాలు కాగా  ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మధ్యాహ్నం 2 గంటల సమ యంలో  ఇసుకదర్శి ఫైఓవరు పై జరిగిన ఇంకో ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఒంగోలు వైపు వెళ్లే రోడ్డులో ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇద్దరు గాయపడ్డారు. వీరిని హైవే ఆంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌ కు తరలించారు. క్షతగాత్రులు ఒంగోలుకు చెందిన వ్యక్తులని సమాచా రం. పూర్తివివరాలు తెలియలేదు. 

ఇదిలాఉండగా ఈ మూడు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి స్టేష న్‌కు రాత్రి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. 

Updated Date - 2021-10-29T05:19:19+05:30 IST