గుది‘బండలు’ !

ABN , First Publish Date - 2021-03-22T06:29:43+05:30 IST

పంట పొలాల్లో ఎన్నో ఏళ్ల తరబడి నుంచి గ్రానైట్‌ ముడిరాళ్లు గుదిబండల్లా పడిఉన్నాయి. వీటిని తొలగించకపోవటంతో సాగు కష్టం గా మారిందని రైతులు లబోదిబోమంటున్నారు. రాళ ్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఆ ఛాయలకు వెళ్లకపోవటంతో ఈ రాళ్లను ఏమి చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు.

గుది‘బండలు’ !
బల్లికురవ-నాగరాజుపల్లి రోడ్డు మార్జిన్‌లో ఉన్న గ్రానైట్‌ వ్యర్థాలు

ఈర్లకొండ నుంచి నిత్యం గ్రానైట్‌ ముడిరాళ్లు తరలింపు

పంట పొలాల్లోకి దొర్లిపడుతున్న వైనం

ఏళ్ల తరబడి అలాగే..

కన్నెత్తి చూడని ఫ్యాక్టరీ యజమానులు

లోబోదిబోమంటున్న రైతులు

పట్టించుకోని అధికారులు


బల్లికురవ, మార్చి 21  : పంట పొలాల్లో ఎన్నో ఏళ్ల తరబడి నుంచి గ్రానైట్‌ ముడిరాళ్లు గుదిబండల్లా పడిఉన్నాయి. వీటిని తొలగించకపోవటంతో సాగు కష్టం గా మారిందని రైతులు లబోదిబోమంటున్నారు. రాళ ్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఆ ఛాయలకు వెళ్లకపోవటంతో ఈ రాళ్లను ఏమి చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. పడిపోయిన రాళ్లు తీసుకుపోవడానికి రూ.లక్షల్లో ఖర్చు కానుండడంతో ఫ్యాక్టరీ యజమానులు ముందుకు రావటంలేదని రై తులు వాపోతున్నారు. పరిమితికి మించి ముడిరాయి ని తరలించేక్రమంలో ఇవి జారి పడుతున్నాయని రై తులు చెబుతున్నారు. వాహనాల వెనుక వెళ్లాలన్న భ యంభయంగా ఉంటుందని వాహన చోదకులు అంటున్నారు. మండల పరిధిలోని ఈర్లకొండ గ్రానైట్‌ క్వారీల నుంచి రోజూ మార్టూరు, మేదరమెట్ల, సంతమాగులూ రు, చెన్నై బెంగళూరు తదితర ప్రాంతాలకు ముడి రా యి బ్లాకులను లారీలలో తరలిస్తుంటారు. వాటిని త రలించేటప్పుడు ఒక్కోసారి లారీలపై నుంచి కిందకు జారి పడుతుంటాయి. పంట పొలాల్లో కూడా పెద్ద ఎ త్తున పడిఉన్నాయి. ఇవి ఎంతో కాలంగా ఉన్నా ఎవ రూ తొలగించిన పాపాన పోలేదు ఏటా పంటలు సా గు చేసే సమయంలో రైతులు ఈ రాళ్లు చూసి వీటిని ఎవరు తొలగిస్తారా అని ఎదురు చూస్తుంటారు. తొలగించకపోవడం తో చేసేదేమి లేక అలానే సాగు చే స్తున్నారు. గ్రానైట్‌ బ్లాకు పడిపోయిన చోట పంట పండించటం క ష్టంగా ఉందని రైతులు అంటున్నా రు. మండల పరిధిలోని బల్లికురవ-మార్టూరు, బల్లికురవ-కొమ్మాలపాడు, అద్దంకి-బల్లికురవ, సంతమాగులూరు-చెన్నుపల్లి, అనంతవరం రోడ్లలో అధికంగా గ్రా నైట్‌ ముడిరాళ్లు మార్జిన్లలో పడిఉన్నాయి. నక్కబొక్కలపాడు నాగరాజుపల్లి, బల్లికురవ, కొణిదెన, బల్లికురవ, చెన్నుపల్లి రోడ్ల మార్జిన్లలో గ్రానైట్‌ ఫ్యాక్టరీల వ్యర్థాలు పడవేస్తున్నారు. ఇలా పడేయడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి దీనికితోడు గ్రానైట్‌ ముడిరాయి వా హనం తరలిస్తున్నప్పుడు ఎక్కడోచోట కొన్ని రాళ్లు జా రిపడుతున్నాయి. ఆ లారీల వెనక వెళుతుంటే ఎక్కడ రాయి జారిపడుతుందోనని వాహనచోదకులు ఆందోళనకు గురవుతున్నారు. క్వారీలలో రాయిని తరలించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లారీల్లో పేర్చిన రాళ్లకు పక్కకు దొర్లకుండా చిన్నపాటి రాళ్ల ముక్కలను పెడుతున్నా అవి పక్కకి బెసకటంతో రాయి మార్జిన్‌లోకి దొర్లుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రాళ్ల యజమానులు స్పందించి వెంటనే పంట పొలాల్లో అడ్డుగా ఉన్న ముడి రాళ్లను తొలగించాలని రైతులు వాహన చోదకులు కోరుతున్నారు.
Updated Date - 2021-03-22T06:29:43+05:30 IST