వైభవంగా ధ్వజారోహణ

ABN , First Publish Date - 2021-10-21T06:59:59+05:30 IST

మండలంలోని కరేడు గ్రామంలోని శ్రీ లక్ష్మీపతి స్వామివారి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ బుధవారం వేదమత్రోచ్ఛారణల మధ్య జరిగింది.

వైభవంగా ధ్వజారోహణ
ధ్వజానికి పూజచేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి విశేష పూజలు

కరేడు(ఉలవపాడు), అక్టోబరు 20 : మండలంలోని కరేడు గ్రామంలోని శ్రీ లక్ష్మీపతి స్వామివారి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ బుధవారం వేదమత్రోచ్ఛారణల మధ్య జరిగింది. కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నూతన ఽధ్వజస్తంభం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.  భక్తులకు ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. 

Updated Date - 2021-10-21T06:59:59+05:30 IST