పండుగలా తెలుగు భాషా దినోత్సవం

ABN , First Publish Date - 2021-12-31T04:56:58+05:30 IST

తెలుగు భాషపై మ క్కువ కలిగి ఉండాలని వక్తలు పేర్కొన్నారు. వైపాలెం మండ లంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం తెలుగుభాషా దినో త్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థినీవిద్యార్థులు ఘనంగా ని ర్వహించారు.

పండుగలా తెలుగు భాషా దినోత్సవం
కంభంలో వివిధ వేషధారణలతో అలరించిన విద్యార్థులు


ఎర్రగొండపాలెం, డిసెంబరు 30  : తెలుగు భాషపై మ క్కువ కలిగి ఉండాలని వక్తలు పేర్కొన్నారు. వైపాలెం మండ లంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం తెలుగుభాషా దినో త్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థినీవిద్యార్థులు ఘనంగా ని ర్వహించారు. ఈనెల 27న ఇంగ్లాష్‌, 28వ తేదీన హిందీ, 29వ తేదీన గిరిజన భాష, 30వ తేదీన తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సం దర్భంగా ఎంఈవో పి.ఆంజనేయులు మాట్లాడుతూ మం డలంలోని అన్ని పాఠశాలల్లో నాలుగు రోజులుగా భాషా ఉత్స వాలను నిర్వహించామన్నారు. భాషపై విద్యార్థుల సృజనా త్మక తను గుర్తించామన్నారు. వై.కొత్తపల్లి పాఠశాలలో జరిగిన భాషోత్సవాల్లో ప్రభుత్వం పాఠశాల హెచ్‌ఎం శామ్యూల్‌ జాన్‌, ఉ పాధ్యాయులు కె.సత్యనారాయణ, పీఎంసీ చైర్మన్‌ నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మురారిపల్లి, సర్వాయిపాలెం ప్రాథమిక పాఠశాలలో  విద్యార్థినులు తెలుగుతల్లి, సరస్వతి దే వి, విద్యార్ధులు కవుల వేషధారణలతో ఆకట్టుకున్నారు.

భాషాభివృద్ధికి కృషి చేయాలి

పెద్ద దోర్నాల :  భాషాభివృద్ధికి ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలని ఎంఈవో మస్తాన్‌ నాయక్‌ అన్నారు. స్థానిక ఎంపీపీ మెయిన్‌ పాఠశాలలో ప్రధానోఫాధ్యాయుడు జవహర్‌ లాల్‌ నాయక్‌ అధ్యక్షతన భాషోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మస్తాన్‌ నాయక్‌ మా ట్లాడుతూ తెలుగు భాషపై అవగాహనతో పాటు ఉచ్ఛరణ దో షాలు లేకుండా చూడాలన్నారు. తెలుగుతోపాటు ఆంగ్ల భాషను కూడా నేర్చుకోవాలన్నారు.  ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు  అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు షేక్‌ షరీ ఫ్‌, ఎం.వర్ధన్‌, వెంకటేశ్వర్లు, విజయకుమారి పాల్గొన్నారు. 

తెలుగు భాషకు పట్టాభిషేకం

కంభం : అమ్మ భాషకు అందలం వేస్తూ ఆనందోత్సవాల నడుమ తెలుగు భాషకు పట్టాభిషేకం నిర్వహించారు. పార్కు వీధిలోని ప్రాథమిక పాఠశాలలో భాషోత్సవాలను గురువారం పండుగలా నిర్వహించారు. విద్యార్థులు  పలు వేషధారణలతో వినూత్నంగా నిర్వహించారు. కథలు, కవితలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలపై పోటీలు నిర్వహించారు. కా ర్యక్రమంలో తల్లిదండ్రులు కమిటీ చైర్మన్‌ కాకర్ల శిరీష, హెచ్‌ఎం రసూల్‌బేగ్‌, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రెహమత్‌, ఖాశింభాషా, అది నాభి, లక్ష్మీప్రసన్న, సీఆర్పీ మురళీమోహన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T04:56:58+05:30 IST