భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులు
ABN , First Publish Date - 2021-10-30T05:28:25+05:30 IST
భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులను వినియోగించాలని ఒం గోలు భూసార పరీక్ష కేంద్ర సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల సూచించారు. ఈ విషయమై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నా రు.
ఏడీఏ నిర్మల
అద్దంకి టౌన్, అక్టోబరు 29 : భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులను వినియోగించాలని ఒం గోలు భూసార పరీక్ష కేంద్ర సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల సూచించారు. ఈ విషయమై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నా రు. భూమి పోషక అభియాన్‌లో భాగంగా శుక్ర వారం అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అద్దంకి డివిజన్ పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకుల శిక్షణ కార్యక్రమంలో ని ర్మల ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కచ్ఛితంగా భూ సార పరీక్షలు చేయించాలన్నారు. భూమిలో కర్భన శాతం తక్కువగా ఉంటే దాని నివారణకు పచ్చి రొట్ట సాగు చేసుకోవాలన్నారు. కర్భన శాతం తగ్గితే సూక్ష్మ పోషకాల లోపాలు వస్తాయని తెలిపారు. అద్దంకి ఏడీఏ కె.ధనరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందిస్తుందన్నారు. ప్రతి రైతు ఈ-పంట నమోదు చేయించుకొనేలా చూడా లన్నారు. కార్యక్రమంలో అద్దంకి, కొరిశపాడు, తా ళ్లూరు, ముండ్లమూరు మండలాల వ్యవసాయ అ ధికారులు కొర్రపాటి వెంకటకృష్ణ, శ్రీనివాసరావు, ప్రసాద్, శ్రీధర్, టెక్నికల్ ఏవో సుబ్బారెడ్డి, ఉద్యాన అధికారి ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.