కరోనా వ్యాక్సిన్‌పై తొలగని అపోహలు

ABN , First Publish Date - 2021-06-21T06:48:55+05:30 IST

కరోనా టీకాపై ఇంకా ఎస్టీలలో అపోహలు తొలిగిపోలేదు. ఉలవపాడులోని ఎంపీడీవో కార్యాలయం వద్ద కోటిరెడ్డి కుంట సంఘం యానాదుల వద్దకు యావత్తు అధికార యంత్రాంగం వచ్చినా కరోనా టీకాలు వేయించలేకపోయారు.

కరోనా వ్యాక్సిన్‌పై తొలగని అపోహలు
అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఉలవపాడు, జూన్‌ 20 : కరోనా టీకాపై ఇంకా ఎస్టీలలో అపోహలు తొలిగిపోలేదు. ఉలవపాడులోని ఎంపీడీవో కార్యాలయం వద్ద కోటిరెడ్డి కుంట సంఘం యానాదుల వద్దకు యావత్తు అధికార యంత్రాంగం వచ్చినా కరోనా టీకాలు వేయించలేకపోయారు. ఆదివారం చేపట్టిన ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి డీఆర్‌డీఏ పీడీ బీ.బాబురావు గ్రామంలో జరుగుతున్న వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. కోటిరెడ్డికుంట సంఘం ఎస్టీ కాలనీలోకి స్వయంగా డీఆర్‌డీఏ పీడీతోపాటు తహసీల్దార్‌ సంజీవరావు, ఎంపీడీవో రవికుమార్‌, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ వర్కర్లు అందరూ వచ్చి టీకా వేయించుకోవాలని సూచించడంతో యానాదులు పక్కనే ఉన్న తోటల్లోకి పరుగుతీశారు. కరేడు పంచాయతీలో జరుగుతున్న వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారిణి పీ రత్నావళి సందర్శించారు. మండలంలో 2000 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యాధికారులు కే శ్రీనివాసరావు, సీహెచ్‌ రాజ్యలక్ష్మీ చెప్పారు.

Updated Date - 2021-06-21T06:48:55+05:30 IST