రైతుల చూపు.. షేడ్‌నెట్‌ వైపు

ABN , First Publish Date - 2021-08-25T06:01:39+05:30 IST

ఒకప్పుడు ఉద్యాన పంటలకు కేంద్రంగా పేరున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం నేడు మిరప నర్సరీలకు కేంద్రంగా మారింది.

రైతుల చూపు.. షేడ్‌నెట్‌ వైపు
నర్సరీలలో పెంచుతున్న మిరప నారు

ఏటికేడు పెరుగుతున్న సాగు

మిర్చినారుకు ప్రాధాన్యం

వర్షాలులేక నష్టాలపాలు

త్రిపురాంతకం, ఆగస్టు 24 : ఒకప్పుడు ఉద్యాన పంటలకు కేంద్రంగా పేరున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం నేడు మిరప నర్సరీలకు కేంద్రంగా మారింది. జిల్లాలో వె నుకబడిన ప్రాంతమైనప్పటికీ ఆధునిక సేద్యం వైపు కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో రక్షిత వ్యవసా యం (షేడ్‌నెట్‌) ఏటికేడు పెరుగుతున్న వేళ ఉద్యానశాఖ అందిస్తున్న రాయితీలను వినియోగించుకొని నియో జకవర్గంలో అధిక విస్తీర్ణంలో మిరప నర్సరీలను పెం చుతున్నారు. జిల్ల్లాలో వందల ఎకరాల్లో నర్సరీలు ఏర్పా టుకాగా మార్కాపురం డివిజన్‌లో షేడ్‌నెట్‌లు, గ్రీన్‌హౌస్‌ రకాలకు చెందిన అనేక నర్సరీలు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి.

రక్షిత వ్యవసాయం.. లాభాల సాయం 

నానాటికీ భూముల వి లువ పెరుగుతోంది. దీం తో వ్యవసాయ భూమి తగ్గిపోతోంది. ఈ క్రమం లో పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు, అధిక ఆదాయం సమకూర్చుకునే దిశగా రైతుల ఆలోచనలు మా రుతున్నాయి. రక్షిత వ్యవసాయం (షేడ్‌నెట్‌) సా గు అందుకు అనువైనది మారడంతో రైతులు ఆ సక్తి చూపుతున్నారు. గ్రీన్‌హౌస్‌,  షేడ్‌నెట్‌లలో సాగు చేపడితే మండుటెండల్లోనైనా అవసరమైన మేర గాలిని తీసుకుని ఉష్ణోగ్రతను 35 డిగ్రీలకు తగ్గిస్తుంది. అతి తక్కువ నీటితో సాగు చేయవచ్చు. పాలీనెట్‌, ఇన్‌సెక్ట్‌నెట్‌ ద్వారా పురుగులు, కీటకాల నియంత్రణ వల్ల మందుల పిచికారీ కూడా చేయన వసరం లేదు. ఎరువులు కూడా నేరుగా మొక్కకే అందిం చవచ్చు. నాలుగు ఎకరాల్లో లభించే పంట ఉత్పత్తిని రక్షిత వ్యవసాయం ద్వారా ఎకరంలోనే చేయొచ్చు. ఎక్కువ ఉత్పత్తి, పంట సంరక్షణ, అధిక ఆదాయమే రక్షిత వ్యవసాయం ముఖ్య ఉద్దేశం.

ఈదురు గాలులకు తట్టుకునేలా

శీతాకాలంలో ఎక్కువ చలి, వర్షాకాలంలో అధిక వానలు, వేసవి కాలంలో ఎండలు, విపరీతమైన గాలులు పంటల నష్టానికి కారణంగా మారుతున్నాయి.  అదే షేడ్‌నెట్‌ సాగుతో నష్టాన్ని తగ్గించుకోవచ్చు.  వేసవిలో అధిక వేగంతో వీచే గాలులకు తట్టుకునేలా కొత్తరకం డబుల్‌ షేడ్‌నెట్‌ రకం వచ్చింది. సన్నని తీగపై ఆధారపడి ఎటుగాలి వీస్తే అటు వాలిపోయే గుణం ఉంది. గాలి వేగం 120 కి.మీ మించితే చుట్టూ అతికించిన  పైబర్‌ తీగ తెగిపోయి తెరలుగా ముడుచుకుపోయే సౌకర్యం కూడా ఉంది. దీంతో వేగంగా గాలులు వీచినా నర్సరీ యజమానికి పెద్దగా నష్టం వాటిల్లదు.

మిర్చికి అధిక ప్రాధాన్యం

త్రిపురాంతకం మండలంలోని శ్రీనివాసనగర్‌, రాజుపాలెం, మేడపి, బీఆర్‌ జంక్షన్‌, సోమేపల్లి, గ్రామాల పరిధిలో వ్యాపారులు నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో 95 శాతం మిర్చి మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎకరాకు ఒక్క విడతలో 14 లక్షల మొక్కలు పెరగగా ఎకరాకు 15 వేల చొప్పున 99 ఎకరాలకు మాత్రమే మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఒక్కో నర్సరీ యజమాని రెండు విడతలుగా మొక్కలను విత్తుతారు. ఈ విత్తనాలకు అధిక గిరాకీ ఉంది. దీనికి తోడు జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో పత్తి, పొగాకు సాగును తగ్గించి మిర్చిపై ఆసక్తి చూపడంతో మిర్చి విత్తనాలకు మరింత గిరాకీ వచ్చింది. గతేడాది మిరపనారు, పంటపై అధిక లాభాలు రావడంతో ఈఏడాది రైతులు పెద్దమెత్తంలో ఖర్చు చేసి షేడ్‌నెట్‌లు, నర్సరీలలో మిరప నారును పెంచారు. కానీ ప్రకృతి ప్రకోపంలో వర్షాలులేక మిరప నారుకొనే రైతులు కొంతమేర తగ్గారు. దీంతో షేడ్‌నెట్‌లు, నర్సరీల యజమానులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.




Updated Date - 2021-08-25T06:01:39+05:30 IST