రైతులు ఈ - క్రాప్‌లో నమోదు చేయించండి

ABN , First Publish Date - 2021-08-10T07:02:58+05:30 IST

మండలంలోని రైతులు తాము సాగు చేసే పంటలను ఖచ్చితంగా సమీప రైతుభరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకుల దగ్గర ఈ-క్రాప్‌లో నమోదు చేయించుకోవాలని వ్యవసాయాధికారి జి.మధు సోమవారం చెప్పారు.

రైతులు ఈ - క్రాప్‌లో నమోదు చేయించండి

లింగసముద్రం, ఆగష్టు 9 : మండలంలోని రైతులు తాము సాగు చేసే పంటలను ఖచ్చితంగా సమీప రైతుభరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకుల దగ్గర ఈ-క్రాప్‌లో నమోదు చేయించుకోవాలని వ్యవసాయాధికారి జి.మధు సోమవారం చెప్పారు. ఈ-క్రాప్‌ నమోదు చేయించుకోవడం వలన పకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, బీమా, నష్టపరిహారం అందుతుందన్నారు. అలాగే    పంటల సాగుహక్కు ధ్రువీకరణపత్రం పొందిన కౌలు రైతులు కూడా ఈ అవకాశాన్ని పొందవచ్చన్నారు. రైతు సోదరులందరూ రైతుభరోసా కేంద్రంలో పాస్‌బుక్‌, ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబరు నమోదు చేయించుకోవాలన్నారు.

అలాగే మండలానికి 25 క్వింటాళ్ళ పీయూ-31 రకం మినుము విత్తనాలను కేటాయించారన్నారు. ఈ విత్తనాలను 30 శాతం రాయితీపై రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కిలో విత్తనం పూర్తి ధర రూ.115.10 కాగా, రాయితీ రూ.34.53 పోను, రైతు రూ.84.57 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2021-08-10T07:02:58+05:30 IST