భయపెడుతున్న బ్లాక్‌ ఫంగస్‌

ABN , First Publish Date - 2021-05-18T05:53:39+05:30 IST

కరోనాతో ప్రజలు విల విల్లాడుతున్నారు. పాజిటివ్‌ కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.

భయపెడుతున్న బ్లాక్‌ ఫంగస్‌

మార్కాపురంలో ఆరు కేసులు 

ఒకరి మృతి

విజయవాడలో చికిత్స 

పొందుతున్న నలుగురు

డబ్బు లేక ఇంటి వద్దే 

ఇబ్బంది పడుతున్న మరొకరు

మార్కాపురం, మే 17 : కరోనాతో ప్రజలు విల విల్లాడుతున్నారు. పాజిటివ్‌ కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సమ యంలోనే వెలుగు చూస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు భయం కలిగిస్తున్నాయి. తాజాగా మార్కాపురంనకు చెందిన ఐదుగురు, మండలంలోని రాయవరంనకు చెం దిన ఒకరు ఈ ఫంగస్‌ బారినపడ్డారు. వారిలో ఓ మ హిళ మృతి చెందింది. మిగిలిన ఐదుగురిలో నలుగురు విజయవాడలోని ఓ కార్పొరేట్‌ వైద్యశాలో చికిత్స పొందుతుండగా, మరొకరు ఇంటి వద్దనే ఇబ్బంది పడుతున్నాడు. 

అందరూ కరోనా బాధితులే

బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన ఆరుగురూ కరోనా బాధితులే. వీరందరికీ కరోనా రెండో దశలో పాజిటివ్‌ వచ్చింది. ఇద్దరు పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్య శాలలో, మరో నలుగురు మార్కాపురంలోని జిల్లా వైద్యశాలలో చికిత్స పొందారు. నెగెటివ్‌ రిపోర్టులు వ చ్చిన తర్వాత ఇళ్లకు వెళ్లారు. అందులో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరిలో మా ర్కాపురం పట్టణానికి చెందిన ఓ మహి ళకు కళ్లు ఉబ్బడం, ముఖం వాపు వంటి లక్షణాలు కనిపించడంతో ఆమెను కరో నాకు చికిత్స తీసుకున్న వైద్యశాలకే తర లించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అంటువంటి లక్షణాలు మరో ఐదుగురికి కనిపించాయి. వారిలో న లుగురు   విజయవాడలోని మణిపాల్‌ వైద్యశాలలో చే రి చికిత్స పొందుతున్నారు.   పట్టణంలోని ఎస్టేట్‌కు చెందిన చంద్రయ్య అనే బాధితుడు ఆర్థిక స్థోమత లేక ఇంట్లోనే ఉన్నాడు.

వైద్యానికి రూ.20లక్షలకు పైనే..

కరోనా పాజిటివ్‌ వచ్చిన మధుమేహ బాధితులకు చికిత్స సమయంలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ సోకుతుందని డాక్టర్‌ పి. రాంబాబు తెలిపారు. ఈఎన్‌టీ సర్జన్లు మాత్రమే ఈ బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్స అందించగలరని చెప్పారు. అయితే చికిత్సకు రూ.20 లక్షలకు పైగా ఖర్చవు తుందని తాము వైద్యం పొందుతున్న ఆసుపత్రి యాజ మాన్యాలు తెలిపినట్లు బాధితులు చెప్తున్నారు.


ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రభుత్వ వైద్యశాలల చుట్టూ తిరిగాను. డాక్టర్లు ఇక్కడ ఈ రోగా నికి చికిత్స లేదన్నారు. ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లడానికి నా వద్ద డబ్బులు లేవు. ప్రభుత్వం స్పందించి చికిత్స చేయించాలి.

- చంద్రయ్య, బ్లాక్‌ ఫంగస్‌ బాధితుడు


Updated Date - 2021-05-18T05:53:39+05:30 IST