శింగరకొండలో దాతల సహకారంతో వసతులు

ABN , First Publish Date - 2021-12-29T05:17:48+05:30 IST

శింగరకొండలోని శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయ చైర్మన్‌ కోట శ్రీ నివాసకుమార్‌ తెలిపారు. దాతల సహాయంతో భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తా మని చెప్పారు.

శింగరకొండలో దాతల సహకారంతో వసతులు
మాట్లాడుతున్న చైర్మన్‌ శ్రీనివాసకుమార్‌, సభ్యులు

చైర్మన్‌ శ్రీనివాసకుమార్‌ వెల్లడి


అద్దంకి, డిసెంబరు 28 : శింగరకొండలోని శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయ చైర్మన్‌ కోట శ్రీ నివాసకుమార్‌ తెలిపారు. దాతల సహాయంతో భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తా మని చెప్పారు. ఇప్పటి వరకూ ఉన్న అడ్డంకుల న్నీ తొలగిన నేపథ్యంలో మరిన్ని కార్యక్రమాలు చే పట్టేందుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఆలయంలోని తన చాంబర్‌లో మంగళవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలక మండలి సభ్యులతో కలిసి చైర్మన్‌ మాట్లాడారు. తాము బాధ్యతలు స్వీకరించడానికి ముందు 14 నెలలు పాలకమండలి లేకపోవడంతో అధికారు లు, సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరించారన్నా రు. తాము ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ తొమ్మిది నెలల కాలంలో ఈవోతోపాటు ఇద్ద రు సిబ్బంది, ఇద్దరు పూజారులు అభివృద్ధికి అ డ్డంకిగా నిలిచి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డార ని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేయడంతో ఈవోను బ దిలీ చేసి ఒంగోలు అసిస్టెంట్‌ కమిషనర్‌ మాధ విని ఇన్‌చార్జిగా నియమించారని తెలిపారు. దాత ల సహకారంతో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్ర ణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. మా జీ మంత్రి శిద్దా రాఘవరావు సహకారంతో పూర్తి చేసిన మండపంలో త్వరలో అన్నదానాన్ని ప్రా రంభించనున్నట్లు వెల్లడించారు. పాలనా భవనం, గెస్ట్‌షూట్‌లను దాతల సహకారంతో అభివృద్ధి చే స్తున్నామని చెప్పారు. భక్తులకు నాణ్యమైన ప్రసా దం అందించటంతోపాటు, అన్ని సౌకర్యాలు కల్పి స్తామన్నారు. బదిలీ అయిన ఈవో అవినీతిపై వి చారణ చేపట్టాలని పలువురు కోరారు. విలేకరుల సమావేశంలో పాలకవర్గ సభ్యులు జమ్మలమడక రమాదేవి,  కుందుర్తి రజని,  ఎర్రిబోయిన రమణ మ్మ, వంకాయల సరస్వతి, శింగరకొండపాలెం స ర్పంచ్‌ ఎర్రిబోయిన తిరుపతయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-12-29T05:17:48+05:30 IST